Pawan Kalyan : వైసీపీలోని కాపులకి భయంకరమైన ట్విస్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !
Pawan Kalyan : నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు విన్నారా? నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవ్వరికీ తెలియదు. కాపుల సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన చేసింది ఒక ప్రసంగం కాదు.. హిత బోధ అని చెప్పుకోవాలి. నేను రెండు చోట్ల పోటీ చేశాను కానీ.. రెండు చోట్లా ఓడించారు. నన్ను ఇక్కడ పోటీ చేయండి.. అక్కడ పోటీ చేయండి అని మీరే సలహాలు ఇస్తారు. పోటీ చేస్తే ఓడిస్తారు. కాపులు నాకు ఓట్లేశారా? వాళ్లంతా ఓట్లు వేసి ఉంటే నేను నిజంగానే గెలిచేవాడిని. నేను ఓడిపోతే కేరింతలు కొట్టింది కూడా కాపులే.
అందుకే కాపుల్లో ఐక్యత లేదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది.అలాగే.. రంగ గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆయన బతికి ఉన్నప్పుడు ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు కానీ.. ఆయన చనిపోతే లక్షల మంది మాత్రం వచ్చారు. అసలు ఆయన నిరసనకు మద్దతు తెలిపి ఆయన దగ్గరికి వచ్చి ఉంటే.. ఆయన మీద దాడే జరిగేది కాదు. మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి అంటే అది ఈరోజుల్లో జరిగేపని కాకపోతే.. డబ్బులు తీసుకోకుండా ఉండలేం అంటే..డబ్బులు తీసుకోండి. కానీ.. డబ్బులు ఇచ్చిన వాళ్లకు మాత్రం ఓట్లేయకండి అంటూ పవన్ కళ్యాణ్ హితువు పలికారు.
Pawan Kalyan : కాపులు పొరపాటున కూడా వైసీపీకి ఓటేయకండి
కాపుల్లో ఐక్యత లేదా? లేదా కాపులు తనకు ఓటేయలేదంటున్నారా? కాపులు డబ్బులు తీసుకోకుండా ఉండలేరా? కాపులను వైసీపీకి ఓటేయొద్దు అని చెప్పడం వెనుక పవన్ ఉద్దేశం ఏంటి.. తన పార్టీ వేయాలని చెప్పారా? లేక టీడీపీ వేయాలన్నారా? అసలు.. పవన్ కళ్యాణ్ కాపులను ఉద్దేశించి ఏం చెప్పాలనుకున్నారో.. ఏం చెప్పారో కానీ.. అటు బీసీ, ఎస్సీలకు కూడా రాజ్యాధికారం రావాలంటున్నారు. కాపులు, బీసీలు, ఎస్సీలు.. పవన్ కళ్యాణ్ ఎవ్వరినీ వదలడం లేదు. ఆయన అసలు స్ట్రాటజీలు ఏంటో మున్ముందు ఇంకా క్లియర్ గా తెలియనున్నాయి.