Holes to Pots in Cremation : అంత్యక్రియల్లో కుండలో నీళ్లు పోసి ఎందుకు రంధ్రాలు పెడతారు? కుండను ఎందుకు పగులగొడతారు?
Holes to Pots in Cremation : మనిషి జీవితంలో పుట్టుక, చావు.. ఈ రెండు చెప్పి రావు. మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా పుడతాడో ఎవ్వరికీ తెలియదు. అలాగే.. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతాడో కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే.. పుట్టిన తర్వాత మనిషి జీవితం ప్రారంభం అయితే.. చనిపోయిన తర్వాత ఆ మనిషి జీవితం అంతం అవుతుంది. అయితే.. మనిషి శరీరానికి మాత్రమే పుట్టుక, చావు అనేవి ఉంటాయి కానీ.. మనిషి ఆత్మకు కాదు.మనిషి పుట్టిన తర్వాత ఎలా పురుడు, బారసాల లాంటి కార్యక్రమాలు చేస్తారో.. మనిషి చనిపోయాక కూడా అంత్యక్రియలు అనేవి నిర్వహిస్తారు.
ఆ అంత్యక్రియలను హిందూ ధర్మశాస్త్రం ప్రకారమే చాలామంది నిర్వహిస్తారు. అందులో ముఖ్యమైనది కుండను పగులగొట్టడం. కుండకు రంధ్రాలు చేసి దాన్ని పగులగొట్టడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కాల్చేయడమో లేక సమాధి చేయడమే చేస్తారు. మనిషిని చితి మీద పెట్టిన తర్వాత ఆ వ్యక్తికి తలగోరు పెట్టే వ్యక్తితో నీళ్లు పోసి ఉన్న కుండను పట్టుకొని మూడు సార్లు తిరగాలంటూ చెబుతారు.
Holes to Pots in Cremation : కుండను పగులగొట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే?
ఒకసారి చితి చుట్టు తిరిగి రాగానే.. ఆ కుండకు ఒక రంధ్రం చేస్తారు. రెండోసారి తిరిగి రాగానే.. రెండో రంధ్రం చేస్తారు. ఆ రంధ్రాల గుండా నీళ్లు కిందపడిపోతుంటాయి. మూడో సారి తిరిగి రాగానే.. మూడో రంధ్రం చేసి.. ఆ కుండను తలగోరు పెట్టే వ్యక్తితో పగులగొట్టిస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తారు.అలా చేయడం వెనుక ఉన్న అర్థం ఏంటంటే.. కుండ మనిషిని సూచిస్తుంది. కుండలో ఉండే నీళ్లు ఆత్మను సూచిస్తాయి.
చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ శరీరంలో నుంచి ఎలా వెళ్లిపోతుందో.. నీళ్లు కూడా అలా కుండలో నుంచి వెళ్లిపోవడం కోసం రంధ్రాలు పెడతారు. ఆ తర్వాత మనిషి శరీరాన్ని కాల్చేస్తారు కాబట్టి.. కుండను కూడా పగులగొట్టేస్తారు.ఇక ఆ ఆత్మకు శరీరం లేదు అని చెప్పడం కోసం కుండను పగులగొట్టేస్తారు. శరీరాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆత్మకు సూచించడం అన్నమాట.