why regi fruits are poured on head of children
Makar Sankranti : తెలుగు వారు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో మొదటి రోజుది భోగి పండుగ. ఈ రోజు భోగి మంటలు వేస్తారు. చలిని తట్టుకునేందుకు అందరూ మంటలు వేయడం వల్ల దీనికి భోగి అనే పేరొచ్చిందని చెబుతారు పెద్దలు. ఈ పండుగ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు రేగి పండ్లు పోస్తారు. వీటిని భోగి రోజున పోస్తారు కాబట్టి.. భోగి పళ్లు అంటారు. భోగి పళ్ల ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తుంటారు.
ఐదేండ్లు లోపు వారికి భోగి పండ్లు పోస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల వారిని పిలుస్తారు. పిల్లలకు దిష్టి తీస్తారు. ఇలా చేయడానికి వెనుక ఓ శ్రాస్త్రీయత ఉందంట. పిల్లలపై భోగి పళ్లు పోస్తున్న టైంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైకి చేరి బ్రహ్మ రంధ్రానికి శక్తినిస్తుంది. మేధస్సునూ పెంచుతుంది.పిల్లల తలపై నుంచి రేగు పళ్లు పోయడం వల్ల ఆ పళ్ల నుంచి వచ్చే వాయువు తలలోని మెదడు నరాలకు యాక్టివ్‌గా చేస్తాయి. వింటర్‌లో వచ్చే దగ్గు, జ్వరం, జలుబు వంటి రోగాలతో పిల్లలు ఇబ్బందులు పడుతుంటారు.
why regi fruits are poured on head of children
దీని నుంచి రక్షించేందుకు రేగు పళ్లు ఉపయోగపడతాయి. పిల్లలకు వ్యాధులను ఎదుర్కొనే శక్తి రావడం కోసమే భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో ఉపయోగం. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత రోగాలను నివారించేందుకు సహాయపడుతుంది. ఈ పళ్లు ఉన్న చోటు క్రీములు రావని నమ్మతారు. ఈ పళ్ల నుంచి వచ్చే సువాసన మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ పళ్లు తినేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ పళ్లు కేవలం వింటర్ సీజన్ లో మాత్రమే లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.