Makar Sankranti : పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు? కారణం ఏంటంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Makar Sankranti : పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు? కారణం ఏంటంటే..

 Authored By mallesh | The Telugu News | Updated on :14 January 2022,3:30 pm

Makar Sankranti : తెలుగు వారు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో మొదటి రోజుది భోగి పండుగ. ఈ రోజు భోగి మంటలు వేస్తారు. చలిని తట్టుకునేందుకు అందరూ మంటలు వేయడం వల్ల దీనికి భోగి అనే పేరొచ్చిందని చెబుతారు పెద్దలు. ఈ పండుగ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు రేగి పండ్లు పోస్తారు. వీటిని భోగి రోజున పోస్తారు కాబట్టి.. భోగి పళ్లు అంటారు. భోగి పళ్ల ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తుంటారు.

ఐదేండ్లు లోపు వారికి భోగి పండ్లు పోస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల వారిని పిలుస్తారు. పిల్లలకు దిష్టి తీస్తారు. ఇలా చేయడానికి వెనుక ఓ శ్రాస్త్రీయత ఉందంట. పిల్లలపై భోగి పళ్లు పోస్తున్న టైంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైకి చేరి బ్రహ్మ రంధ్రానికి శక్తినిస్తుంది. మేధస్సునూ పెంచుతుంది.పిల్లల తలపై నుంచి రేగు పళ్లు పోయడం వల్ల ఆ పళ్ల నుంచి వచ్చే వాయువు తలలోని మెదడు నరాలకు యాక్టివ్‌గా చేస్తాయి. వింటర్‌లో వచ్చే దగ్గు, జ్వరం, జలుబు వంటి రోగాలతో పిల్లలు ఇబ్బందులు పడుతుంటారు.

why regi fruits are poured on head of children

why regi fruits are poured on head of children

Makar Sankranti : : మెదడులోని నరాలు యాక్టివ్

దీని నుంచి రక్షించేందుకు రేగు పళ్లు ఉపయోగపడతాయి. పిల్లలకు వ్యాధులను ఎదుర్కొనే శక్తి రావడం కోసమే భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో ఉపయోగం. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత రోగాలను నివారించేందుకు సహాయపడుతుంది. ఈ పళ్లు ఉన్న చోటు క్రీములు రావని నమ్మతారు. ఈ పళ్ల నుంచి వచ్చే సువాసన మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ పళ్లు తినేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ పళ్లు కేవలం వింటర్ సీజన్ లో మాత్రమే లభిస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది