Adani – Ambani : ఆదానీ, అంబానీ పేర్లు చెప్తే జనం ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు?
Adani – Ambani : ముకేశ్ అంబానీ, అదానీ.. ప్రస్తుతం వీళ్లే కదా మన దేశాన్ని పాలించేది. అదేంటి.. మన దేశ ప్రధాని వీళ్లు కాదు కదా. మరి వీళ్లెలా మన దేశాన్ని పాలిస్తారు అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. నిజానికి వీళ్లు మన దేశ ప్రధాని కాదు కానీ.. వీళ్లు కార్పొరేట్లు. కార్పొరేట్స్ ఈ దేశాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లు ఎంత చెబితే అంత అన్న స్థాయికి మన దేశం చేరుకుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి.. ఏ దేశం అయినా ఆ దేశానికి చెందిన బడా పారిశ్రామిక వేత్తలు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. కానీ.. మన దేశంలో రెస్పెక్ట్ లేదు.. ఏం లేదు.
ఎందుకంటే.. కార్పొరేట్లుగా ఎదిగి ధరలు పెంచి దేశ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.ఒకప్పుడు మన దేశానికి చెందిన బడా పారిశ్రామిక వేత్తలంటే అందరికీ గౌరవం ఉండేది. టాటాలు, బిర్లాలు తెలుసు కదా. వాళ్లు మన దేశానికి వన్నె తెచ్చారు. ఒక టాటా సంస్థనే తీసుకోండి. ఆ సంస్థ మన దేశానికి చేసే సేవ ఎంతో ఉంది. మన దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల విరాళాలను అందిస్తుంది. కానీ.. అంబానీ, అదానీపై మాత్రం ఈ దేశ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. భారత్ లో కేవలం అంబానీ, అదానీ అనే ఇద్దరు పారిశ్రామిక వేత్తలు తప్ప ఇంకెవరూ లేరా?
Adani – Ambani : అంబానీ, అదానీ తప్ప వేరే పారిశ్రామిక వేత్తలు ఇండియాలో లేరా?
వాళ్లకే పలు ప్రాజెక్టులు ఎలా దక్కుతున్నాయి. 5జీ అంబానీకే ఎందుకు దక్కింది. గనులు, పోర్టులు అదానీకే ఎందుకు దక్కాయి. చివరకు విశాఖ స్టీల్ కూడా అదానీకే దక్కేలా చూశారట. వీళ్లిద్దరినీ కాదని ఏ కంపెనీ వచ్చినా.. వాళ్లపై కేంద్రం కన్నెర్ర చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆయా కంపెనీలపై ఈడీలు, సీబీఐలు దాడులు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే.. ఆ రెండు కంపెనీలకే అన్ని దక్కడంతో మరోవైపు ప్రజల నుంచి వాళ్లకు తీవ్రమైన వ్యతిరేకత వస్తోందని అంటున్నారు.