YS Jagan : వైఎస్ జగన్ విషయంలో ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారు?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఏపీలో ప్రధాన ప్రత్యర్థి అంటే టీడీపీనే. కానీ… టీడీపీని తోసిరాజని బీజేపీ దూసుకువస్తోంది. ఏపీలో అధికార వైసీపీని ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బీజేపీ వల్ల సీఎం జగన్ ను కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో సీఎం జగన్ బీజేపీని కాస్త గట్టిగానే ఎదుర్కోవాలి. లేకపోతే జగన్ పీఠానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. చాపకింద నీరులా బీజేపీ ఏపీలో విస్తరిస్తోంది. బలపడుతోంది. ఆ విషయం తిరుపతి ఉపఎన్నికల్లో తెలిసే అవకాశం ఉంది. బీజేపీని ప్రజలు ఎంతలా విశ్వసిస్తున్నారో అక్కడ తేలుతుంది. ఏది ఏమైనా… బీజేపీ విషయంలో జగన్ కాస్త ఆచీతూచీ అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.
బీజేపీ నేతలు కూడా జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో జగన్ కూడా కాస్త దూకుడు పెంచారు. కానీ… బీజేపీని ఎదుర్కోవాలంటే జగన్… మూకుమ్మడిగా రావడం లేదు. తాను ఎప్పుడూ ఒంటరిగానే బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తున్నారు.
ఎందుకంటే… బీజేపీ విషయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారు. దానికి కారణాలు కూడా అనేకం. వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలపై చాలా కేసులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల బీజేపీపై విర్శలు చేయడానికి వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సాహసించడం లేదు అనే ప్రచారం కూడా ఊపందుకుంది.
అందుకే… బీజేపీ నేతలు సీఎం జగన్ పై ఎక్కు పెట్టినా… జగన్ పై విమర్శలు చేస్తున్నా… వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి జంకుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అందుకే… సీఎం జగన్ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో కూడా జగన్ కు తన ఎమ్మెల్యేల నుంచి మద్దతు రావడం లేదు.
YS Jagan : ఒంటరిగానే బీజేపీపై జగన్ పోరు?
సీఎం జగన్… బీజేపీని విమర్శించాలన్నా… కౌంటర్ ఇవ్వాలన్నా… తాను ఒంటరిగానే పోరాడాలి. చివరకు ప్రధాని మోదీని విమర్శించాలన్నా… జగన్ కు పెద్దగా తన పార్టీ నుంచి మద్దతు లభించకపోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు… తమకు నచ్చినట్టు చేయడం వల్ల… హైకమాండ్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అసలు… తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? ఎటువంటి పనులు జరుగుతున్నాయి? ఏయే సమస్యలు ఉన్నాయి? అనే వాటిపై హైకమాండ్ దృష్టికి ఎవ్వరూ తీసుకురావడం లేదు… అని అంటున్నారు. అందుకే… బీజేపీ విషయంలో సీఎం జగన్ కాస్త ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.