YS Jagan : 2024 ఎన్నికలని టార్గెట్ చేస్తూ సుప్రీంకోర్టులో జగన్ పిటిషన్.. మామూలు ప్లాన్ కాదు ఇది..!
YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఒకే ఒక విషయం గురించి చర్చ. అదే మూడు రాజధానుల అంశం. మూడు రాజధానుల అంశం చీలికి చీలికి గాలి వానలా తయారైంది. టీడీపీ ప్రభుత్వం ఒకే రాజధానిని తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఆవశ్యకత ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ.. మూడు రాజధానులపై చాలా పెద్ద రచ్చ జరిగింది. మూడు రాజధానులపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రానికి ఎక్కడిది అంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. అలాగే మూడు రాజధానుల చట్టాలను అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకోవాలని తీర్పు చెప్పింది.
దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం మరో చర్చకు దారి తీసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఆరు నెలల ముందే దాఖలు చేయాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు దాఖలు చేసింది అనేదే పెద్ద ప్రశ్న. ఈ పిటిషన్ పై ఇంకా సుప్రీంలో విచారణ ప్రారంభం కాలేదు.
YS Jagan : సుప్రీం తీర్పు కోసం ఎదురుచూపులు
ఓవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? సుప్రీం తీర్పు ఏం ఇస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు సుప్రీం తీర్పు ఇస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అనేదే కీలకంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లోపు మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహం మరోలా ఉంది. ఇప్పటికిప్పుడు సుప్రీం కూడా మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వదని టీడీపీ భావిస్తోంది. అలాగే.. వైసీపీ ఆలస్యంగా సుప్రీంలో పిటిషన్ వేయడం వెనుక ఉన్న ఉద్దేశం.. ఎన్నికల వరకు ఈ అంశాన్ని సాగదీయడం కోసమే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. చూద్దాం మరి.. అసలు ఎవరి వ్యూహాలు వర్కవుట్ అవుతాయి.. ఎవరివి వర్కవుట్ కావు అనేది.