YS Jagan : ఈ కష్టం నుంచి జగన్ ని బయట పడేసేది ఎవరు??
YS Jagan : ఓవైపు ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ఎలా ఎన్నికలను ఫేస్ చేయాలో తెలియక సతమతమవుతోంది. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్.. ఇప్పుడు రెండో చాన్స్ ఎలా అడగాలి. రెండో చాన్స్ అడిగితే జనాలు ఇస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. రెండో చాన్స్ అని అడగడం కాదు.. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అప్పుడు ఓట్లు అడగాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు సీఎం జగన్. అందుకోసమే..
కొత్తగా పార్టీలో అబ్జర్వర్లను నియమించబోతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ను నియమించాలని జగన్ యోచిస్తున్నారు. దీని బాధ్యతను సజ్జల, వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించారు. వచ్చే నెల అంటే డిసెంబర్ ఫస్ట్ వీర్ లో అబ్జర్వర్ల నియామకం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొత్తగా నియమితులయ్యే అబ్జర్వర్లు.. నియోజకవర్గాల్లో పార్టీ ఎలా ఉంది.. అక్కడి ఎమ్మెల్యే పనితీరు.. అక్కడి ప్రజల స్పందన.. అక్కడి సమస్యలు అన్నింటిపై అక్కడ అధ్యయనం చేస్తారు. తమకు కేటాయించిన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు తమకు ఎదురవుతున్నాయో వాళ్లు గుర్తించాలి.
YS Jagan : కొత్తగా నియమితులయ్యే అబ్జర్వర్ల పని ఏంటి?
ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికను అధిష్ఠానానికి పంచించాలి. అలాగే.. అసలు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా దానిపై వివరాలు సేకరించాలి. అసలు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో కూడా గుర్తించాలి. అయితే.. ఇవన్నీ చూసుకోవడానికి ఇప్పటికే చాలామంది ఉన్నారు కదా. మళ్లీ కొత్తగా ఈ అబ్జర్వర్లు ఎందుకు.. అంటూ కొందరు వైసీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. పార్టీలో జిల్లా అధ్యక్షుల పని కూడా ఇదే. రీజనల్ కోఆర్డినేటర్ల పని కూడా ఇదే. వీళ్లందరూ కాదని.. మళ్లీ అబ్జర్వర్లు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది.