YS Jagan : ఆ మూడు నియోజకవర్గాల మీద సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఆ మూడు నియోజకవర్గాల మీద సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. !

 Authored By kranthi | The Telugu News | Updated on :17 December 2022,9:40 pm

YS Jagan : సులభంగా గెలిచే నియోజకవర్గాలపై ఎక్కువగా ఎవ్వరూ దృష్టి పెట్టరు. కానీ.. కష్టతరమైన నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. ఎక్కడ గెలుపు అసాధ్యమూ.. ఎక్కడ గెలవడం కష్టమో అక్కడే ఫోకస్ పెడుతుంది. అక్కడే దృష్టి పెడుతుంది. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే పని చేస్తున్నారు. గెలుపు కష్టతరంగా ఉన్న ఆ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల మీద సీఎం జగన్ ఫోకస్ పెంచారు. ఏపీలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

అందులో 2019 ఎన్నికల్లో వైసీపీ 22 నియోజకవర్గాల్లో గెలిచింది. మూడు నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అవి విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అది కూడా కొద్ది తేడాతోనే. నిజానికి.. అక్కడ ఇంకాస్త కష్టపడి ఉంటే వైసీపీ ఆ నియోజకవర్గాల్లోనూ గెలిచేది. కేవలం 10 వేల లోపు మెజారిటీతోనే అక్కడ వైసీపీ ఓడిపోయింది. అయితే.. 2014 లోనూ ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి మాత్రం ఎలాగైనా ఆ మూడు నియోజకవర్గాలను గెలవాలన్న కసిలో సీఎం జగన్ ఉన్నారు.

why ys jagan targeted three parliamentary constituencies

why ys jagan targeted three parliamentary constituencies

YS Jagan : జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఈ మూడు నియోజకవర్గాలు అన్నీ టీడీపీ కంచుకోటలేమీ కాదు. వీటిలో శ్రీకాకుళంలో మాత్రం టీడీపీ ఏడు సార్లు గెలిచింది. ఎర్రన్నాయుడు తర్వాత ఆ నియోజకవర్గాన్ని రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఈసారి అలా కాకుండి ఆయా నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. మరి.. వైఎస్ జగన్ ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయా? ఒకవేళ ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిస్తే అప్పుడు మొత్తం 25 నియోజకవర్గాలు వైసీపీ వశం అవుతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది