
wife commits-sucid out of anger at husband for not eating
ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న కారణాలకు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకప్పుడు మనిషి ఎటువంటి అవమానం లేదా ఓటమి ఎదురైన స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవాడు. కానీ ప్రస్తుత సమాజంలో మనిషి ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. పరీక్షలలో ఫెయిల్ అయితే సూసైడ్, ప్రేమ ఫెయిల్ అయితే సూసైడ్, ఉద్యోగం రావడం లేదని పెళ్లి కావడం లేదని ఇంకా మరి ఎటకారంగా చూసుకుంటే ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వటం లేదని ఆత్మహత్య చేసుకున్న పిల్లలు కూడా ఎక్కువ అయిపోతున్నారు. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఘటనలకు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
తన భర్త భోజనం చేయడం లేదని.. తాను చేసిన వంటకాలు ముట్టడం లేదని కారణంతో భార్య ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 11లో జరిగింది. గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉంటున్న సంగీత మరియు సంజీవయ్య లకు 2019లో వివాహం అయ్యింది. సంజీవ ప్రైవేట్ గా పనిచేస్తూ… భార్యను పోషిస్తున్నాడు. అలా ఇద్దరి జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో… సంగీత అనారోగ్యానికి గురైంది. అటువైద్యం తీసుకుంటూనే చిన్న చిన్న విషయాలకు సంగీత భర్తతో గొడవ పడుతుండేది. దీంతో ఎంతో మనస్థాపానికి గురైన భర్త సంజీవయ్య… భార్య పెట్టే టార్చర్ కి ఇంట్లో తినడం మానేశాడు. భోజనం విషయమై సంగీత మళ్లీ భర్తతో గొడవ పెట్టుకోవడం జరిగింది.
wife commits-sucid out of anger at husband for not eating
ప్రతిరోజు వంట చేస్తున్న… తినకపోతే మొత్తం పరాయాల్సి వస్తుంది అంటూ సంగీత మనస్థాపానికి గురికాక వేమి పట్టించుకోకుండా భర్త తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. భర్త తన మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో సంగీత ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త సంజీవయ్య ఇంటికి వచ్చేసరికి భార్య ఉరేసుకుని మరణించడంతో వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అతి చిన్న కారణంతో భార్య ఇలా మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.