Wife Revenge : నైట్ అది చేస్తూ ఉండ‌గా భ‌ర్త మృతి.. సమాధి మీద అలా రాసిన భార్య.. అందరూ షాక్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife Revenge : నైట్ అది చేస్తూ ఉండ‌గా భ‌ర్త మృతి.. సమాధి మీద అలా రాసిన భార్య.. అందరూ షాక్!

 Authored By mallesh | The Telugu News | Updated on :28 September 2022,9:30 pm

Wife Revenge : సృష్టిలో అన్నింటికన్నా బలమైనది పెళ్లి. అందుకే పెళ్లి చేసుకున్న వారు అన్యోన్యంగా కలిసి ఉంటారు. అయితే దంపతులు అందరూ ఆనందంగా ఉండాలని ఏమి రూల్ లేదు. కొంతమంది గొడవలు పడుతూనే ఉంటారు. మరికొందరు గొడవల్లో కూడా కలిసే ఉంటూ.. ఏదోలా తమ రిలేషన్‌ను కొనసాగిస్తూ ఉంటారు. ఇక మరికొందరైతే ఇలా గొడవలు పడటం ఇష్టం లేక విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇది వారికి మనశ్శాంతిని ఇస్తుందని వారు నమ్ముతుంటారు. అయితే, పిల్లలు ఉన్నవాళ్లు వారి కోసం సర్దుకుపోతుంటారు. పిల్లలు లేని వారు విడాకులు తీసుకునేందుకు దైర్యం చేస్తారు. అయితే చనిపోయిన భర్త సమాధి మీద భార్య రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Wife Revenge : ఇలా కూడా ప్రతీకారం తీర్చుకుంటారా..

భర్త మీద పీకల్లోతు కోపం ఉన్న ఓ ఇల్లాలు, అతడు చనిపోయిన సమాధిలో శాశ్వతనిద్రలో ఉంటే.. ఆమె ఎవరూ ఊహించని పని చేసింది. అతడి గురించి ఆమె బూతులు రాసింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్య ఇలా ఎలా చేస్తుందంటూ అందరూ మండిపడుతున్నారు.కానీ ఆమె ఎందుకు చేయాల్సివచ్చిందని మాత్రం కారణాలు వెతకడం లేదు. ఏదేమైనా భార్య చేసిన పనికి ఆ భర్త మరణించినా కూడా అతని ఆత్మకు శాంతి దొరకదని కొందరు అనుకుంటున్నారు. అమెరికాకు చెందిన జాన్ డోయ్ అనే వ్యక్తికి పెళ్లి అయ్యింది. అతడికి కొడుకు కూడా ఉన్నాడు.

Wife Revenge That Wife Written About Her Husband On His Grave

Wife Revenge That Wife Written About Her Husband On His Grave

కొన్నాళ్ల తర్వాత అతడికి ఆఫీసులో ఒక అమ్మాయి పరిచయం అవ్వడం, ఆ తర్వాత వారిద్దరు శారీరకంగా సంబంధం పెట్టుకోవడం జరిగింది. అయితే తన భార్యను వదిలేసి జాన్ డోయ్ తన ప్రేయసితోనే ఉండసాగాడు. అయితే తన ప్రియురాలితో సెక్స్ చేస్తూ జాన్ ప్రాణాలు విడిచాడు. జాన్ మరణించడంతో అందరూ అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే భర్త మీద పీకల్లోతు కోపంగా ఉన్న ఆ భార్య అతడి సమాధి మీద బండ బూతు రాసింది. అతడి సమాధిపై ‘ జాన్‌ డోయ్‌ జ్ఞాపకార్థంగా.. జాన్‌ డోయ్‌ ఓ తండ్రికి కొడుకు.. ఓ భార్యకు భర్త.. ఓ కొడుక్కి తండ్రి.. ఓ వ్యభిచారి’ అని రాసింది. దీంతో జాన్ కొడుకుతో పాటు బంధువులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది