Wild Sweetsop : రామబాణం లాంటి అద్భుతమైన ఫలం.. దీంతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు..!
ప్రధానాంశాలు:
Wild Sweetsop : రామబాణం లాంటి అద్భుతమైన ఫలం.. దీంతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు..!
Wild Sweetsop : ప్రతిరోజు రామబాణం పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడు తినే పండ్లు కాకుండా మార్కెట్లోకి కొత్త కొత్త పండ్లు మనకి కనబడుతూ ఉంటాయి. అందులో ఒకటి రామఫలం. ఈ పండు తింటుంటే స్ట్రాబెరీ ఫైన్ ఆపిల్ పండ్లను కలిపి తింటున్నట్టు ఉంటుంది. ఈ పండు రుచి చాలా బాగుంటుంది. దీనిలోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చెట్టు ఆకులు, వేర్లు, కాయలు, బెరడు, విత్తనాలు కూడా ఎన్నో వ్యాధులకు చికిత్సగా వాడుతూ ఉంటారు. ఈ పండు బ్రెజిల్ కి చెందినదిగా చెబుతూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో కొన్నిచోట్ల ఈ రామ ఫలం చెట్లు కనపడతాయి.
ఈ పండు చూడడానికి సీతాఫలం లాగా ఉంటుంది. ఈ రామ ఫలం తొక్కపై ముళ్ళు కనపడుతూ ఉంటాయి. దీనిలోని ఎస్సిటో జెన్స్ కింగ్ లోన్స్, ఆల్కలైడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తాయని చెప్తూ ఉంటారు. అలాగే రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి రోగాల నుండి కాపాడుతుంది. ఈ పండు జీర్ణసంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. జీవన సమస్యలు ఉన్నవారు ఈ పండును తరచూ తీసుకోవాలి. ప్రోటీన్ డైటరీ ఫైబర్ క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ పోలేట్ లాంటి ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. చాలామంది మహిళలకు పీరియడ్స్ సమయంలో శరీరంలో నీరు నిలిచిపోయి ఉబ్బినట్లు కనిపిస్తూ ఉంటారు.
ఈ రామఫలం తినడం వలన ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనిలో ఉండే పొటాషియం శరీరంలో నీరు నిలుపుదలను కంట్రోల్ చేస్తుంది. ఈ పండును సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కీమోథెరపీ అని కూడా చాలా చోట్ల పిలుస్తూ ఉంటారు. ఈ పండును ఈ చెట్లు ఆకులను తీసుకోవడం వలన 12 రకాల క్యాన్సర్లు తరిమికొట్టవచ్చని ఎంతోమంది చెప్తున్నారు. కొన్ని పరిశోధన ప్రకారం రామా ఫలంలో ఆల్క లైట్స్ ప్లేవానాయిడ్స్ డ్రై గ్లిజరేడ్స్, ఫినోలెక్స్, సైక్లో పైటేట్స్ లాంటి ముఖ్యమైన ఫైటో కెమికల్స్ 20012 వరకు ఉంటాయి 100 గ్రాముల పండులో 81 గ్రాముల నీరే ఉంటుంది.