Ys Jagan ; టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీనియర్ పొలిటీషియన్. ముఖ్యమంత్రిగా మొత్తం 14 ఏళ్ళ అనుభవం ఆయన సొంతం. పదిహేనేళ్ళపాటు ప్రతిపక్ష నేతగానూ పని చేశారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్నప్పుడు, ఆయనెంత హుందాగా వుండాలి.? హుందాతనం అంటేనే ఆయనకు తెలియదు. కానీ, తరచూ ఆయన హుందాతనం గురించి మాట్లాడుతుంటారు. ‘ఏం పీకావ్..’ అని పదే పదే తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు అదిలిస్తుంటారు.
ఇదెక్కడి పంచాయితీ.? అసలు చంద్రబాబుకి ఏమయ్యింది.? రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు. మరీ ఇంతలా బరితెగించాలా.? ఇవే కాదు, ఇంకా చాలా రకాల విమర్శలు చంద్రబాబు నుంచి వస్తుంటాయి. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చంద్రబాబు దోమల మీద దండయాత్ర చేశారు. కోవిడ్ సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవి లేదనీ, పదవి వుండి వుంటే కోవిడ్ వైరస్‌ని రానిచ్చేవాడిని కాదనీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో తుపాన్లను తానే అడ్డుకున్నట్టుగా చంద్రబాబు ఇచ్చిన బిల్డప్ అందరికీ గుర్తుండే వుంటుంది.

2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతిన్నాక, చంద్రబాబు ప్రవర్తనలో చాలా చాలా మార్పులొచ్చాయ్. ఆ మార్పుల ఫలితమే, ఇప్పుడాయన చేస్తున్న వ్యాఖ్యలు. సీనియర్ నేతలతో, రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టిస్తున్నారు చంద్రబాబు. చెప్పుకుంటూ పోతే, చంద్రబాబు అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. తాను తరచూ చెప్పే హుందాతనం చంద్రబాబు ప్రదర్శిస్తే, అది టీడీపీ కాస్తో కూస్తో మేలు చేస్తుంది. లేదూ, బూతు తెలివితేటలే కొనసాగించాలని చంద్రబాబు అనుకుంటే అంతే సంగతులు.!