KCR : క్షమించమని కేసీఆర్ అడగబోతున్నారా? ఏపీలో అడుగు పెట్టే ముందు గట్టి ప్రకటన? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : క్షమించమని కేసీఆర్ అడగబోతున్నారా? ఏపీలో అడుగు పెట్టే ముందు గట్టి ప్రకటన?

 Authored By kranthi | The Telugu News | Updated on :23 January 2023,7:40 pm

KCR : ఒకప్పటి రాజకీయాలు వేరు ఇప్పుడు వేరు. ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగింది. ఆ సమయంలో ఏపీకి చెందిన ప్రజలను తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ పార్టీ గట్టి డిమాండ్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. కాలం గిర్రున తిరిగింది. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం అయి ఉంటే  ఇప్పుడు కేసీఆర్ కు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశమంతా విస్తరించింది. ఏపీలోనూ విస్తరించాలి.

ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టాలంటే ఒకసారి గతంలో ఏపీ గురించి, ఏపీ ప్రజల గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలి.గతంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఏపీ ప్రజలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లకు ఇప్పుడు నేను సిగ్గు పడుతున్నాను.. అని కేసీఆర్ ప్రకటించాలి. ఆ తర్వాతే ఆంధ్రాలో అడుగుపెట్టాలన్నారు. అసలు.. బీఆర్ఎస్ పార్టీనే ఏపీ ప్రజలు స్వాగతించరని..

will cm kcr say sorry to ap people

will cm kcr say sorry to ap people

KCR : ప్రజలను అవమానించిన కేసీఆర్.. ఆంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అంటూ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ.. ప్రజలను అవమానించి.. ఇప్పుడు ఏపీకి వచ్చి ఎలా రాజకీయాలు చేస్తారు. ప్రజలను అవమానించిన కేసీఆర్.. ఆంధ్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. కాదూ కూడదు అంటే కేసీఆర్ ను అడ్డుకొని తీరుతాం అంటూ జీవీఎల్ సీరియస్ అయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ చేరే పరిస్థితి లేదని.. మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొందరు మాత్రం అందులో చేరారని..  వాళ్లకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది