Kodali Nani : ఇంత వీక్ అభ్యర్థితో కొడాలి నానిని ఓడిస్తారా.. ? ఏంటి జోక్ ఆ ?
Kodali Nani : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటేనే ఫైర్. వైసీపీకి ఫైర్ బ్రాండ్ ఆయన. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేశ్ పై రోజూ ఏదో ఒక విషయంపై కొడాలి నాని విమర్శిస్తూనే ఉంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంటాయి. అందుకే కొడాలి నాని నోరు మూయించాలని చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. కొడాలి నానిని మాత్రం ఓడించలేకపోతున్నారు.
అందుకే.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారు. అందకోసం టీడీపీ నుంచే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నారు. కానీ.. కొడాలి నానిని ఓడించడం కోసం ఎవరిని బరిలోకి దించాలి అనేదానిపై చంద్రబాబుకే ఇప్పటి దాకా క్లారిటీ లేదు. ఎందుకంటే.. అసలు గుడివాడలో కొడాలి నానిని ఓడించే టీడీపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు. అందుకే వేరే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతను ఇక్కడ రంగంలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
Kodali Nani : దేవినేని ఉమను బరిలోకి దించుతున్నారా?
గుడివాడ నుంచి కొడాలి నానిని ఓడించేందుకు ఏకంగా మాజీ మంత్రి ఉమా మహేశ్వర రావును చంద్రబాబు బరిలోకి దించబోతున్నాడట. నిజానికి ఉమాది మైలవరం నియోజకవర్గం. కానీ.. గుడివాడలోనూ దేవినేని ఉమకు మంచి పాపులారిటీ ఉంది. ఆయన అయితేనే కొడాలి నానిని ఓడించగలడని చంద్రబాబు భావిస్తున్నారట. దేవినేని ఉమ కూడా గుడివాడ నుంచి పోటీ చేస్తా అని చంద్రబాబుకు చెప్పారట. అసలు.. కొడాలి నానిని ఓడించే సత్తా ఉమాకు ఉందా అంటూ ఈ విషయం తెలిశాక గుడివాడ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. మరి.. దేవినేని ఉమకు.. కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో కొడాలిని ఓడించే సత్తా ఉందా? అనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.