Chandrababu : చంద్రబాబు మాటని సొంత ఎమ్మెల్యేలే నమ్మలేక పొమ్మన్నారు..!
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎన్నికలపై ఇప్పటికే టికెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేశారా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్లీ టికెట్లు ఖాయమా? అంటే ఖాయమే అన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి కానీ… ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వాళ్లందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చేస్తా అని చంద్రబాబే ప్రకటించారు. నేను.. టీడీపీ సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ ఇస్తున్నా.. మరి నేను చెప్పినట్టుగా వైసీపీలో సిట్టింగ్స్ అందరికీ వైఎస్ జగన్ టికెట్లు ఇస్తారా? అంత ధైర్యం చేస్తారా? అని చంద్రబాబు ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో చెప్పుకొచ్చారు.
తప్పులు చేసేది జగన్.. కానీ తన తప్పులను నెట్టేది మాత్రం ఎమ్మెల్యేల మీద.. అంటూ చంద్రబాబు మండిపడ్డారు. అయితే అసలు.. వైసీపీలో టికెట్ల గొడవ చంద్రబాబుకు ఎందుకు అనే ప్రశ్న ప్రస్తుతం లేవనెత్తాల్సిన అంశం. టీడీపీలో సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ ఇవ్వాలా? ఇవ్వొద్దా? ఎవరికి టికెట్లు ఇవ్వాలి అనేది చంద్రబాబు ఇష్టం. కానీ.. వైసీపీ విషయంలో తను ఏం చేయలేడు కదా. ఒకవేళ ఏ నేత అయినా టికెట్ ఇస్తే ఓడిపోతాడు అనుకుంటే చంద్రబాబు టికెట్ ఇవ్వడు కదా. ఏ పార్టీ అయినా అంతే. వైసీపీలో కూడా అందరు సిట్టింగ్స్ కు టికెట్ ఇవ్వాలో ఇవ్వకూడదో జగన్ డిసైడ్ చేసుకుంటారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Chandrababu : జగన్ పై అర్థం లేని చాలెంజ్ ను చంద్రబాబు విసిరారా?
ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబుకు కూడా ఉంది. జగన్ కు కూడా ఉంది. జగన్ కు రెండో సారి అధికారంలోకి వచ్చి తన సత్తా చాటాలని ఉంది. మరి ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవాలి. అదే కదా. అప్పుడే ఆ పార్టీ గెలుస్తుంది. లేకపోతే ఓడిపోతుంది. మరి ఓడిపోయే వాళ్లకు టికెట్ ఇస్తే పార్టీ ఎలా గెలుస్తుంది? అధికారంలోకి ఎలా వస్తుంది? ఈ చిన్న లాజిక్ ను చంద్రబాబు ఎలా మరిచిపోయారు. ఆ చిన్న లాజిక్ ను మరిచిపోయి చంద్రబాబు ఎలా జగన్ పై చాలెంజ్ విసిరారు అంటూ రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. తాను టికెట్లు ఇచ్చే విషయంలోనే చంద్రబాబు కొన్ని షరతులు పెట్టారట. ప్రజా సమస్యలపై వీరోచిత పోరాటం చేసేవాళ్లకే టికెట్లు ఖరారు అని చెప్పారు. టికెట్లు ఇచ్చే విషయంపై చంద్రబాబు మాత్రం షరతులు పెట్టొచ్చు కానీ.. జగన్ మాత్రం సిట్టింగ్స్ అందరికీ టికెట్లు ఇవ్వాలా అంటున్నారు. మరోవైపు ఈ షరతులు ఏంటి అని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకొని కూర్చున్నారట.