ChandraBabu : హైదరాబాద్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు?
ChandraBabu : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మూడు రాజధానుల చుట్టు తిరుగుతున్నాయి. ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తోంది. సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. మరోవైపు ఏపీకి ఒకటే రాజధాని ముద్దు.. అదే అమరావతి ముద్దు అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టిన యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని..
త్వరలోనే వైజాగ్ లో పరిపాలన మొదలవుతుందని కూడా జగన్ భరోసా ఇచ్చారు.ఇదెలా ఉంటే… మూడు రాజధానుల అంశంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల వ్యవస్థ అనేది రాష్ట్రానికే గేమ్ చేంజర్ అని అన్నారు. మూడు రాజధానుల గురించి 2020 వ సంవత్సరంలో తాను రాసిన ఓ ఆర్టికల్ ను ఆయన ఇప్పుడు తెర మీదికి తీసుకొచ్చారు. ట్విట్టర్ లో ఆ ఆర్టికల్ కు సంబంధించి ట్వీట్ చేశారు. ఆ ఆర్టికల్ లింక్ ను కూడా పోస్ట్ చేశారు. ఓవైపు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఒకే రాజధాని అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఈ ఆర్టికల్ ను షేర్ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ChandraBabu : బహుళ రాజధానుల వ్యవస్థ కొత్తేమీ కాదు
ఈసందర్భంగా రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అభివృద్ధి అంటేనే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఉమ్మడి ఏపీలో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేసే పనులు చేపట్టారు అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కన ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అది రాష్ట్ర అభివృద్ధి కాదు కదా. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నింటినీ నిర్లక్ష్యం చేయడం వల్లే ఆయనకు కేవలం హైదరాబాద్ ముఖ్యమంత్రి అనే పేరు వచ్చిందని విజయసాయిరెడ్డి ఎద్దేవ చేశారు. కట్ చేస్తే.. రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన ఆలోచనలు కేంద్రీకృతం దిశగానే ఆలోచించాయని, అందుకే అమరావతికే ఆయన ఓటు వేశారని చెప్పుకొచ్చారు.