Kokila | ఆటోలో ప్రసవం.. మహిళా కానిస్టేబుల్ కోకిల సాహసోపేత చర్యకు ప్రశంసలు

Authored By Sam C | The Telugu News | Published on: August 17, 2025, 3:00 pm

Kokila |  తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఓ గర్భిణికి అనూహ్యంగా ఆటోలోనే ప్రసవం జరగగా, స్థానిక మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో స్పందించి అద్భుతంగా పురుడు పోసిన ఘటన ప్రజల్లో హృదయాన్ని గెలుచుకుంది. వేళంపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమురుగన్‌పూండి రింగ్ రోడ్డులో స్వాతంత్య్ర‌ దినోత్సవం నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించేవేళ, ఓ ఆటోలో ఒడిశాకు చెందిన భారతి అనే యువతి తీవ్రమైన పురుటినొప్పులతో బాధపడుతూ వచ్చింది.

#image_title

ప్ర‌శంస‌లు…

అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చిన పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయింది.ఈ దృశ్యాన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ కోకిల ముందుకు వచ్చి, ఆటోలోనే భారతికి సురక్షితంగా పురుడు పోసారు. ఆసుపత్రికి చేరేలోపు తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేలా చూసిన కోకిలకు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కోకిల తాను పోలీస్ శాఖలో చేరకముందు నర్సింగ్ కోర్సు పూర్తి చేసి, ఓ ఆసుపత్రిలో పని చేసిన అనుభవం ఉండటంతో అది ఆమెకు పెద్దగా ఉపయోగపడింది. తల్లీబిడ్డను అనంతరం తిరుప్పూర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరూ పూర్తిగా క్షేమంగా ఉన్నారు అని వైద్యులు వెల్లడించారు.ఈ సంఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు కోకిలను అభినందించారు.

Sam C

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp