Online Betting Game : ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లో తనను తానే పందెం కాసింది.. ఆ తర్వాత ఏమైందంటే?
Online Betting Game : ఆన్ లైన్ గేమ్స్ తెలుసు కదా. ఆన్ లైన్ గేమ్స్ ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ గేమ్స్ లో బానిస అయితే ఇక ఆ రొంపిని తప్పించుకోవడం చాలా కష్టం. అలా ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన ఓ మహిళ చివరకు తనను తానే పందెం కాసింది. తన శరీరం మీదనే పందెం కాసి తనను తానే పోగొట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన రేణు అనే మహిళ గురించే మనం మాట్లాడుకునేది. రేణు భర్త గత ఆరు నెలల కింద పని కోసం రాజస్థాన్ వెళ్లాడు. పని చేస్తూ వచ్చిన డబ్బులను తన భార్యకు పంపించేవాడు. ఇంటి దగ్గర పిల్లలతో ఉండే రేణు.. స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ టైమ్ పాస్ చేసేది. ఆ టైమ్ పాస్ కాస్త సీరియస్ అయి తను ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైపోయింది. బెట్టింగ్ లో డబ్బులను పెట్టి చాలా పోగొట్టుకుంది. దీంతో ఏం చేయాలో రేణుకు అర్థం కాలేదు. తను అద్దెకు ఉండే ఇల్లు యజమానితో ఒకరోజు లూడో గేమ్ ఆడింది.
woman lost all money and herself in online betting games
Online Betting Game : తనపై తానే పందెం కాసి గేమ్ ఆడిన రేణు
లూడో గేమ్ ఆడుతూ డబ్బు మొత్తం పోగొట్టుకొని చివరకు తనపై తానే పందెం కాసింది రేణు. తనపై తాను పందెం కాసినా కూడా ఆ ఆటలోనూ ఓడిపోయింది రేణు. దీంతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఇంటి యజమాని. దీంతో యజమాని తనను ఏం చేస్తాడో అని భయపడి వెంటనే తన భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో అతడు ఇంటికి తిరిగొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పలువురికి తెలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ అయింది. దీంతో స్థానికంగా అందరూ ఆ ఘటన గురించే చర్చించుకుంటున్నారు.
