
jabardasth ex anchor Anasuya not doing any shows and movies now
Anasuya : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం ఏం చేస్తుంది అంటే సమాధానం ఆమె అభిమానుల వద్ద లేదు. సినిమాల్లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి అంటూ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసిన అనసూయ ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తోంది. ఆ మధ్య తనకు మంచి పరిచయం ఉన్న రోజా ద్వారా జబర్దస్త్ కార్యక్రమంలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు అనసూయ చాలా ప్రయత్నాలు చేసింది అనే పుకార్లు షికార్లు చేశాయి. స్టార్ మా కార్యక్రమాల్లో యాంకర్ గా మరియు జడ్జ్ గా వ్యవహరించేందుకు
జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిన అనసూయ ఇప్పుడు అక్కడ కూడా పని లేక దిక్కులు చూస్తుంది. పైగా సినిమాల్లో కూడా ఆఫర్స్ రావడం లేదు. ఇటీవల వరుసగా వచ్చిన సినిమాలు ఆమెకు నిరాశ మిగిల్చాయి. హీరోయిన్ గా నటించలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు.. ఐటెం సాంగ్స్ వరసగా రావడం లేదు. అయినా కూడా సినిమాల్లో ఆఫర్స్ అంటూ జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పి చాలా పెద్ద తప్పు చేసింది అంటూ ఆమె సన్నిహితులు మరియు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అనసూయ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతుంది తప్పితే షూటింగ్స్ కి ఎక్కువ హాజరు కావడంలేదని టాక్ వినిపిస్తుంది.
jabardasth ex anchor Anasuya not doing any shows and movies now
అనసూయ కెరియర్ ఇంత తక్కువ సమయంలో ఇలా అవుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు. చివరకు ఆమె కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు. ఒకప్పుడు వరుసగా కార్యక్రమాలు చేస్తూ బిజీబిజీగా షూట్స్ తో ఉన్న అనసూయ ఇప్పుడు కొడుకులతో సమయాన్ని గడుపుతుంది. ఇంటి వద్ద ఎక్కువ సమయం ఉంటూ షూట్ లో తక్కువ సమయం ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ అనసూయ పుంజుకుంటుందా బుల్లి తెరపై మరియు వెండి తెరపై సందడి చేస్తుందా అనేది చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.