Xiaomi : షియోమీ నయా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్…
Xiaomi : ప్రస్తుత బిజీ లైఫ్‌లో స్మార్ట్ ఫోన్ లేకుండా చాలా మందికి పనులు జరగవు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్‌నే ఉపయోగిస్తున్నారు ప్రజలు.. ఆన్ లైన్ షాపింగ్ మొదలు, ఫుడ్ ఆర్డర్, ఆన్ లైన్ పేమెంట్, ఆన్ లైన్ వర్క్ ఇలా అన్నింటికీ స్మార్ట్ ఫోన్ అవసరం తప్పనిసరి. ఇక కొందరు ప్రత్యేకంగా గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్‌లను కొంటుంటారు. ఇలా ఎవరి అవసరాలకు తగినట్టుగా వారు స్మార్ట్ ఫోన్లును కొంటుండటంతో కంపెనీలు సైతం కస్టమర్ల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా మోడల్స్‌ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి.
గేమింగ్ కోసం కూడా ప్రత్యేకంగా మొబైల్స్ వస్తున్నాయి. కస్టమర్లు బ్రాండ్ మార్చకుండా ఉండేందుకు దాదాపు అన్ని మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.షియోమి వాచ్ ఎస్ వన్ సిరీస్.. బడ్స్ 3 టీ ప్రో ఇయర్ ఫోన్స్‌తో పాటుగా గ్లోబల్ మార్కెట్‌లో 12 సిరీస్ ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఎంఐ 11 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక షియోమి 12 సిరీస్ ఇండియా రిలీజ్ గురించి మాత్రం తయారీ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.
Xiaomi : ఫ్లాగ్ షిప్ ఫోన్
గతేడాది షియోమి 11 సిరీస్ అల్ట్రా మోడల్‌ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. కొత్త స్మార్ట్ ఫోన్.. 120 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ తో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం 15 నిముషాల్లోనే బ్యాటరీ చార్జింగ్ ఫుల్ అవుతుంది. ఇక దీని సైజు విషయానికి వస్తే.. 6.73 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 256 జీబీ స్టోరేజీను కలిగి ఉంది. హైఎండ్ క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్ తో కస్టమర్ల ముందుకు వచ్చింది. దీని ధర రూ.57,210 నుంచి ప్రారంభమయ్యే చాన్స్ ఉంది.