AP Panchayat Elections : కలిసిపోయిన వైసీపీ, టీడీపీ? ఇదిగో ప్రూఫ్?
AP Panchayat Elections : ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల మీద అందరూ పడ్డారు. అందుకే… ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే బిజీ. ఇప్పటికే రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరో రెండు విడతలు జరగాల్సి ఉంది.

ycp and tdp flag on same rickshaw goes viral
అందరూ ఊహించినట్టుగానే.. వైసీపీ మద్దతుదారులే ఎక్కువగా సీట్లను కైవసం చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. జనాలు కూడా ఎక్కువగా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అది ఏంటంటే.. వైసీపీ, టీడీపీ జెండాలు కట్టి ఉన్న ఓ రిక్షా. అసలు.. వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదా.. కానీ.. రెండు పార్టీల జెండాలను ఒకే రిక్షా మీద చూడటం అంటే నిజంగా ఇది మిరాకిల్ అనే అనుకోవాలి.
AP Panchayat Elections : ఆ ఫోటోకు నెటిజన్లు కామెంట్లు వైరల్
ఇక.. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తూ ఆడుకుంటున్నారు. సూపర్.. టీడీపీ, వైసీపీ కలిసిపోయాయా? వాలంటైన్స్ డే ట్రెండింగ్ పిక్ ఇదే.. అంతర్గత రాజకీయాలు ఇలాగే ఉంటాయి. దొందు దొందే.. అంటూ ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.
ఓవైపు పంచాయతీ ఎన్నికలు ఎంతో వేడిగా ఉంటే.. ఈ ఫోటో మాత్రం అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఏపీ ప్రజలు కూడా ఈ ఫోటోను సోషల్ మీడియాలో చూసి కాసేపు నవ్వుకుంటున్నారు.