YCP : వైసీపీ హై కమాండ్ సంచలనం నిర్ణయం.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్..!!
YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటూ ఉంది. పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో.. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ సత్తా చాటింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో
మొదటి నుండి చాలా బలంగా వైసీపీ ఉంటూ వస్తుంది. అక్కడ కూడా తెలుగుదేశం గెలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి నలుగురు క్రాస్ ఓటింగ్ పై వైసీపీ హై కమాండ్ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ వల్లంగించినందుకు
ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ స్పష్టం చేయడం జరిగింది. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాక కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి… ఓట్లు వేస్తారని ముందే ఊహించిన వైసిపి మిగతా ఇద్దరూ ఎవరు అన్నదానిపై తర్జనభర్జన పడింది. కానీ చివర ఆఖరికి ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కీ పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వీరిద్దరూ రాకపోవడం పెద్ద చర్చనియాంసంగా మారింది.