YS Jagan : జగన్ నిర్ణయానికే ఎదురు తిరుగుతున్న వైసీపీ నేతలు.. నిజమెంత.!? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : జగన్ నిర్ణయానికే ఎదురు తిరుగుతున్న వైసీపీ నేతలు.. నిజమెంత.!?

YS Jagan : అది ఏ పార్టీ అయినా.. ఆ పార్టీ అధినేతను ధిక్కరించే దమ్ము ఆ పార్టీ నేతలకు ఉంటుందా? అస్సలు ఉండదు. అధినేత ఏం చెబితే అది చేయాల్సిందే. లేకపోతే వాళ్లకు మనుగడ ఉండదు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అలాంటివి ఎన్నో ఘటనలు మనం ఇప్పటి వరకు చూశాం. అయితే.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఇటీవల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 63 కులాలు ఉండగా.. అందులో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 January 2023,6:20 pm

YS Jagan : అది ఏ పార్టీ అయినా.. ఆ పార్టీ అధినేతను ధిక్కరించే దమ్ము ఆ పార్టీ నేతలకు ఉంటుందా? అస్సలు ఉండదు. అధినేత ఏం చెబితే అది చేయాల్సిందే. లేకపోతే వాళ్లకు మనుగడ ఉండదు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అలాంటివి ఎన్నో ఘటనలు మనం ఇప్పటి వరకు చూశాం. అయితే.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఇటీవల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 63 కులాలు ఉండగా.. అందులో 56 కులాలకు గాను కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇది వరకు తక్కువ కార్పొరేషన్లు ఉండేవని.. ఇప్పుడు చాలా కార్పొరేషన్లను పెంచామని,

సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కార్పొరేషన్లను పెంచామని.. వాటి ద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. కానీ.. అసలు వాస్తవ పరిస్థితి మాత్రం అది కాదట. ఎందుకంటే.. పేరుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ.. వాటికి ఎలాంటి నిధులు లేవని.. కేవలం చైర్మన్లను నియమించారు తప్పితే.. ఎలాంటి మౌలిక వసతులు లేవని కార్పొరేషన్ చైర్మన్లు మొత్తుకుంటున్నారు. అసలే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ.. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రజలను తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోందా?

YCP leaders are turning against YS Jagan decision

YCP leaders are turning against YS Jagan decision

YS Jagan : ఎన్నికల వేళ ప్రభుత్వం కార్పొరేషన్ల కోసం ఏం చేస్తుంది?

అనేది తెలియదు కానీ.. ఆయా సామాజిక వర్గాలను మాత్రం ఏకీకృతం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. గత బడ్జెట్ లో కార్పొరేషన్లకు కోట్ల రూపాయలను కేటాయించారు కానీ.. ఆ నిధులు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. పేరుకు ప్రతి సామాజిక వర్గానికి ఇంత అని కేటాయించారు కానీ.. ఆ నిధులు మాత్రం ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఏనాడూ వినియోగించిన దాఖలాలు మాత్రం లేవు. అసలు.. నిధులే లేకుండా.. కార్పొరేషన్లను పట్టించుకోకుండా వచ్చే ఎన్నికల్లో జనాలకు ఏం సమాధానం చెబుతారు అంటూ కార్పొరేషన్ చైర్మన్లు సీఎం జగన్ పై చిర్రుబుర్రులాడుతున్నారట. చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది