YSRCP : రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వైసీపీ టాప్ లీడర్ ఛాలెంజ్..!
YSRCP : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. తాజాగా వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఎవరికో తెలుసా? టీడీపీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డికి. ఆయన మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్, వైసీపీ నేతల మధ్య పోరాటం ప్రారంభమైంది. దానికి కారణం.. రెండు నెలల కింద మాచర్లలో చోటు చేసుకున్న పరిణామాలు. అవే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి.
మాచర్లలో పోలీసుల ఆంక్షలు కూడా విధించడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉన్నాయి.నిజానికి వచ్చే ఎన్నికలు ఈ రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈనేపథ్యంలో టీడీపీ నేతలను ఉద్దేశించి ఆయన సవాల్ విసిరారు. తనకు ఓటమి అంటే తెలియదని.. 2004 నుంచి తను ఓటమి ఎరుగని ధీరుడిని అంటూ చెప్పుకొచ్చారు. 2024 లోనూ తన విజయ పరంపర కొనసాగుతుందని పిన్నెళ్లి చెప్పుకొచ్చారు. నిజంగా టీడీపీ నేతలకు దమ్ము ఉంటే.. బ్రహ్మారెడ్డికి ఉంటే.. 2024 లో తనను ఓడించాలని..
YSRCP : నా మీద నిలబెట్టి నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయింది
అప్పుడు తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తన మీద టీడీపీ నాలుగు సార్లు అభ్యర్థిని నిలబెట్టిందని.. కానీ.. నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో ఏం జరిగినా అవన్నీ తనపై రుద్దుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మీరు హెచ్చరిస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు. మీ వార్నింగ్ లకు కూడా భయపడే వాళ్లు ఎవరూ లేరు. మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? ఇప్పటి వరకు కేవలం నాలుగు ఏళ్లలోనే నియోజకవర్గంలో రూ.930 కోట్ల వరకు సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు.