YCP : రాజధాని లో వైసీపీ పర్మనెంట్ నివాసం !
YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకొన నిర్ణయాలలో మూడు రాజధానుల నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్ష పార్టీలు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అమరావతినే ఉంచాలని వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇలాంటి తరుణంలో రాజధానిలో అదిరిపోయే స్ట్రాటజీతో వైసీపీ పర్మినెంట్ నివాసం ఉండేలా సీఎం జగన్ అద్భుత స్కెచ్ వేశారు. మేటర్ లోకి వెళ్తే రాజధాని ప్రాంతంలో కనివిని ఎరుగని రీతిలో 51,392 నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు.
అత్యంత ఖరీదైన ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే కలను పేదవాళ్లకు అందించే విధంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఒకో కుటుంబంలో కనీసం మూడు ఓట్లు చెప్పనా లెక్క కట్టిన ఒకటి పాయింట్ 50 లక్షల ఓట్లు ఈ ప్రాంతంలో వైసీపీకి దక్కబోతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు వెళ్ళబట్టాల పంపిణీ కచ్చితంగా పొలిటికల్ గా వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ ఇవ్వటంతో పాటు ఎన్నికలలో మేలు చేసే కార్యక్రమం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పేదలంతా రాజధాని ప్రాంతంలో చేరితే తెలుగుదేశం పార్టీ గెలుపు కష్టమే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇళ్ళబట్టాల పంపిణీ కార్యక్రమంతో… రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి జగన్ చాలా తెలివిగా చెక్ పెట్టినట్లు చెప్పుకొస్తున్నారు. శుక్రవారం రాజధానిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.