Ramoji Rao : వాలంటీర్ల పేరు చెబితే వణికిపోతోన్న రామోజీరావు..!
Ramoji Rao : దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచించని గొప్ప వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ. ఇది కేవలం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వచ్చిన ఆలోచన. రాష్ట్రంలో ప్రవేశపెట్టే పలు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు, అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. దీన్ని ఏపీ సీఎం జగన్ లాంఛనంగా కొన్నేళ్ల కిందనే ప్రారంభించారు. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేస్తారు. ఆ 50 ఇళ్లలో ఉండే వాళ్లలో ఎంతమంది ప్రభుత్వ పథకాలను తీసుకుంటున్నారు.
ఎంత మంది అసలైన లబ్ధిదారులు. ఎవరెవరికి.. ఎలాంటి పథకాలు అమలవుతున్నాయి.. అనే విషయాలను ప్రభుత్వానికి అందించాలి.ఇప్పుడు అదే వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ ప్రభుత్వానికి ప్లస్ అయింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గర్లో ఉన్నది.. ప్రజల నాడిని తెలుసుకోనేది ఆ వ్యవస్థే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపులో ఖచ్చితంగా వాలంటీర వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. అది ప్రతిపక్ష టీడీపీ పార్టీకి మింగుడుపడటం లేదు. అందుకే వాలంటీర్ల వ్యవస్థ ప్రతిపక్ష పార్టీలకు చాలా సమస్యలు తీసుకొస్తుందని భావించిన టీడీపీ..
Ramoji Rao : ఎల్లో మీడియా ద్వారా వాలంటీర్ల వ్యవస్థపై టార్గెట్
దాన్ని ఎల్లో మీడియా ద్వారా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై చాలా కేసులు వేసింది టీడీపీ. ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. నిజానికి ఈ వ్యవస్థపై తొలి నుంచీ టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా వాలంటీర్ల మీదనే ప్రజలు ఆధారపడుతున్నారు. అంటే.. ప్రజలు వాలంటీర్లనే నమ్ముతున్నారు. ఇదే ప్రతిపక్ష పార్టీలను టెన్షన్ పెడుతోంది.