Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని నడిరోడ్డు మీద వెధవని చేసిన ఎల్లో మీడియా.. చంద్రబాబు మీడియా బిగ్ వెన్నుపోటు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని నడిరోడ్డు మీద వెధవని చేసిన ఎల్లో మీడియా.. చంద్రబాబు మీడియా బిగ్ వెన్నుపోటు

 Authored By kranthi | The Telugu News | Updated on :12 November 2022,3:00 pm

Pawan Kalyan : ఎల్లో మీడియా అంతే తెలుసు కదా. ప్రస్తుతం ఈ మీడియా ఏం రాస్తే అది నిజం అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేతపై నానా రచ్చ చేశారు. ఆయనతో పాటు ఎల్లో మీడియా కూడా రచ్చ చేసింది కానీ.. ఇళ్ల ముందు ఉన్న నిర్మాణాలు, కాంపౌండ్ వాల్స్ ను మాత్రమే అధికారులు కూల్చారంటూ తెల్లారి షాకింగ్ న్యూస్ రాసింది ఎల్లో మీడియా. గత రెండు మూడు రోజులు పవన్ ను ఆకాశానికి ఎత్తిన అదే ఎల్లో మీడియా..

ఇళ్ల కూల్చివేతలపై పవన్ తో పాటు నానా రచ్చ చేసిన అదే ఎల్లో మీడియా ఒకేసారి ఎందుకు రూట్ మార్చింది. ఒక్కసారిగా ఎందుకు పవన్ ను కిందపడేసింది. నిజానికి.. పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆయన టార్గెట్ మొత్తం జగన్ మాత్రమే. జగన్ ను తప్పించి ఆయన ఇంకెవరినీ విమర్శించడం లేదు. ఆయన మొదట్నుంచీ ప్రశ్నిస్తున్నది కేవలం జగన్ ను మాత్రమే. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీనే పవన్ విమర్శించారు.

yellow media stoops down janasena president pawan kalyan

yellow media stoops down janasena president pawan kalyan

Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడంటున్నారా?

అందుకే.. వైసీపీ నేతలు చంద్రబాబుకు పవన్ ను దత్తపుత్రుడు అంటారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు మాత్రం గొంతుచించుకొని అరుస్తున్నారు అంటూ మీడియా కూడా కోడై కూస్తోంది. అయినా కూడా కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను మాత్రమే విమర్శించేందుకు పవన్ ముందుంటారు. అదే పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతుంది అనే విషయాన్ని కూడా మరిచిపోతున్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది