కనుబొమ్మలు చూసి ఎవరు ఎలాంటి వారో ఇలా చెప్పవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

కనుబొమ్మలు చూసి ఎవరు ఎలాంటి వారో ఇలా చెప్పవచ్చు…!

ఒక మనిషి కనుబొమలను బట్టి అవతలి వారి మనస్తత్వం, వ్యక్తిత్వం ఏంటో చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1) కనుబొమల మధ్య ఎక్కువ దూరం ఉన్నవారు ప్రేమ గల వ్యక్తులు. ఏ విషయంలోనైనా సూటిగా ఉంటారు. అయితే ఇతర వ్యక్తులు, అంశాల నుంచి చాలా సులువుగా ప్రభావితం అవుతారు. ఎవరేం చెప్పిన శ్రద్దగా వింటారు. ఈ క్రమంలో భావోద్వేగాలు, భయం, ఆందోళన కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ప్లాన్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 October 2022,6:00 am

ఒక మనిషి కనుబొమలను బట్టి అవతలి వారి మనస్తత్వం, వ్యక్తిత్వం ఏంటో చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1) కనుబొమల మధ్య ఎక్కువ దూరం ఉన్నవారు ప్రేమ గల వ్యక్తులు. ఏ విషయంలోనైనా సూటిగా ఉంటారు. అయితే ఇతర వ్యక్తులు, అంశాల నుంచి చాలా సులువుగా ప్రభావితం అవుతారు. ఎవరేం చెప్పిన శ్రద్దగా వింటారు. ఈ క్రమంలో భావోద్వేగాలు, భయం, ఆందోళన కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ప్లాన్ లేకుండా పనులు, నిర్ణయాలలో ముందుకు వెళతారు.

2) కనుబొమ్మలు బాగా వంగినట్టుగా ఉన్నవారు ఏదైనా సాధించాలని లక్ష్యంతో ఉంటారు. సహనం తక్కువ నాటకీయత ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంతా వారిని గుర్తించాలని కోరుకుంటారు. జీవితంలోకి ఎవరినైనా రానించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

3) కనుబొమ్మలు గీతల నేరుగా ఉండే ఉన్నవారు తార్కికంగా ఆలోచించే లక్షణాలు కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచిస్తారు. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలను వేరుగా ఉంచుతారు. ఒకదాని ప్రభావం మరో దానిపై పడనివ్వరు. మొండిగా సూటిగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. సంబంధం బాంధవ్యాలలో భావోద్వేగాల అలజడులు తక్కువగా ఉంటాయి.

You can tell who they are by looking at their eyebrows

You can tell who they are by looking at their eyebrows

4) ఉమ్మడి కను బొమ్మలు ఉన్నవారు ప్రపంచం, సమాజం తమ గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తారు. వీరి గురించి వీరు వ్యక్తీకరించుకొనే అవకాశాన్ని వదులుకోరు. కళా రంగంలోకి వెళ్లే అవకాశం తక్కువ. వీరికి దయ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఎదుటివారిని క్షమించకుండా కఠినంగా ఉంటారు. నచ్చని అంశాలపై త్వరగా మనస్థాపం చెందుతారు, చిరాకు పడతారు.

5) మందమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్ఛగా బ్రతుకుతారు. ఏదైనా ఎలా ఉన్న దానిని అలానే ఇష్టపడతారు. అందులో లోపాలను వెతకరు. వీరి మీద వీరికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశం ఉద్వేగాలపై కాకుండా తార్కికంగా ఆలోచనలు చేస్తారు. వీరికి ఏదైనా అడ్డు వస్తే బాగా చిరాకు పడతారు.

6) సన్నని కనుబొమ్మలు ఉన్నవారు ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ ఉంటుంది. అయితే తమకు ఆత్మ విశ్వాసం బాగానే ఉన్నట్లుగా భావిస్తారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో సతమతం అవుతుంటారు ఇతరుల సాయం తీసుకుంటారు. ఏదైనా అంశం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎక్కువగా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది