ఒక మనిషి కనుబొమలను బట్టి అవతలి వారి మనస్తత్వం, వ్యక్తిత్వం ఏంటో చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1) కనుబొమల మధ్య ఎక్కువ దూరం ఉన్నవారు ప్రేమ గల వ్యక్తులు. ఏ విషయంలోనైనా సూటిగా ఉంటారు. అయితే ఇతర వ్యక్తులు, అంశాల నుంచి చాలా సులువుగా ప్రభావితం అవుతారు. ఎవరేం చెప్పిన శ్రద్దగా వింటారు. ఈ క్రమంలో భావోద్వేగాలు, భయం, ఆందోళన కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ప్లాన్ లేకుండా పనులు, నిర్ణయాలలో ముందుకు వెళతారు.
2) కనుబొమ్మలు బాగా వంగినట్టుగా ఉన్నవారు ఏదైనా సాధించాలని లక్ష్యంతో ఉంటారు. సహనం తక్కువ నాటకీయత ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంతా వారిని గుర్తించాలని కోరుకుంటారు. జీవితంలోకి ఎవరినైనా రానించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.
3) కనుబొమ్మలు గీతల నేరుగా ఉండే ఉన్నవారు తార్కికంగా ఆలోచించే లక్షణాలు కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచిస్తారు. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలను వేరుగా ఉంచుతారు. ఒకదాని ప్రభావం మరో దానిపై పడనివ్వరు. మొండిగా సూటిగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. సంబంధం బాంధవ్యాలలో భావోద్వేగాల అలజడులు తక్కువగా ఉంటాయి.
4) ఉమ్మడి కను బొమ్మలు ఉన్నవారు ప్రపంచం, సమాజం తమ గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తారు. వీరి గురించి వీరు వ్యక్తీకరించుకొనే అవకాశాన్ని వదులుకోరు. కళా రంగంలోకి వెళ్లే అవకాశం తక్కువ. వీరికి దయ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఎదుటివారిని క్షమించకుండా కఠినంగా ఉంటారు. నచ్చని అంశాలపై త్వరగా మనస్థాపం చెందుతారు, చిరాకు పడతారు.
5) మందమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్ఛగా బ్రతుకుతారు. ఏదైనా ఎలా ఉన్న దానిని అలానే ఇష్టపడతారు. అందులో లోపాలను వెతకరు. వీరి మీద వీరికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశం ఉద్వేగాలపై కాకుండా తార్కికంగా ఆలోచనలు చేస్తారు. వీరికి ఏదైనా అడ్డు వస్తే బాగా చిరాకు పడతారు.
6) సన్నని కనుబొమ్మలు ఉన్నవారు ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ ఉంటుంది. అయితే తమకు ఆత్మ విశ్వాసం బాగానే ఉన్నట్లుగా భావిస్తారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో సతమతం అవుతుంటారు ఇతరుల సాయం తీసుకుంటారు. ఏదైనా అంశం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎక్కువగా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
This website uses cookies.