Nithin : సినీ నటుల్ని అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని బీజేపీ వైపు ఆకర్షించే దిశగా బీజేపీ అధిష్టానం తమవైన వ్యూహాల్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల హైద్రాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, సినీ నటుడు జూనియర్ నందమూరి తారకరామారావుతో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. మీడియా మొఘల్ రామోజీరావుతో కూడా అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే, జూనియర్ ఎన్టీయార్ ఈ భేటీ విషయమై ఎలాంటి రాజకీయ ప్రకటనా చేయలేదు. మర్యాద పూర్వక భేటీగానే అమిత్ షాతో జరిగిన డిన్నర్ మీటింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీయార్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ భేటీని రాజకీయ భేటీగానే బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేసుకుంటున్నారు.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైద్రాబాద్ వచ్చారు. ఈ క్రమంలో క్రికెటర్ మిథాలీ రాజ్, సినీ నటుడు నితిన్‌లను విడివిడిగా కలిశారాయన. జూనియర్ ఎన్టీయార్‌తో భేటీని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిమిత్తం.. అన్నట్లుగా చెప్పుకున్న బీజేపీ, నితిన్ – మిథాలీ రాజ్ విషయంలో మాత్రం భిన్నమైన ప్రకటన చేసింది. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్షణ్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తరఫున ప్రచారం కోసం నితిన్ ఉత్సాహం చూపుతున్నారనీ, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఆయన అమితమైన అభిమానంతో వున్నారనీ చెప్పారు. మిథాలీ రాజ్ అలాగే నితిన్ త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారనీ, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని జేపీ నడ్డా ఆదేశించినట్లుగా లక్ష్మణ్ మీడియాతో చెప్పడం గమనార్హం.
Young Hero Nithin To Campaign For BJP
అయితే, నితిన్ మాత్రం ఈ భేటీ విషయమై ఎలాంటి రాజకీయ ప్రకటనా చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ వున్న యువ నటుడు నితిన్. పైగా పవన్ కళ్యాణ్ అంటే నితిన్‌కి వల్లమాలిన అభిమానం. అవసరమైతే జనసేన పార్టీ తరఫున కూడా ప్రచారం చేయడానికి నితిన్ సిద్ధంగానే వుంటాడు. బీజేపీ – జనసేన మిత్రపక్షాలే గనుక ఈ విషయంలో నితిన్‌కి పెద్దగా ఇబ్బందులు వుండకపోవచ్చు.
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.