Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
Young Man : ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో మద్యం మత్తులో జరిగిన ఒక విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దౌలి గ్రామానికి చెందిన 35 ఏళ్ల అశోక్ అనే యువకుడు మద్యం తాగిన అనంతరం ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పామును చూసి ఆ పామును నోటిలో పెట్టుకొని కొరికి తినేశాడు. మత్తులో ఉన్న అతను ఏమాత్రం ఆలోచించకుండా ఈ దారుణనైకి ఒడిగట్టాడు. ఇది చూసిన అతని తల్లి భయంతో కేకలు వేయగా, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వెంటనే అతన్ని అడ్డుకున్నారు.
Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు… ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
కుటుంబ సభ్యులు ముందుగా అతనికి నీళ్లు తాగించడంతో పాటు నోటిలో ఉన్న పాము ముక్కలను తీసేశారు. అనంతరం అతన్ని బాబేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపించారు. పాము విషపూరితమైనది కాకపోవడం వల్ల అతని ప్రాణాలకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గ్రామంలో చర్చనీయాంశంగా మారిన ఘటన ఈ విచిత్ర ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాము పట్ల భయంతో ఉంటే తప్ప దాన్ని తినాలన్న ఆలోచన సాధారణంగా ఎవరికి వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మద్యం మత్తు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ సంఘటన మరోసారి నొక్కి చెబుతోంది. ప్రస్తుతం అశోక్ వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి…
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…
Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
This website uses cookies.