Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు… ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
ప్రధానాంశాలు:
Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
Young Man : ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో మద్యం మత్తులో జరిగిన ఒక విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దౌలి గ్రామానికి చెందిన 35 ఏళ్ల అశోక్ అనే యువకుడు మద్యం తాగిన అనంతరం ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పామును చూసి ఆ పామును నోటిలో పెట్టుకొని కొరికి తినేశాడు. మత్తులో ఉన్న అతను ఏమాత్రం ఆలోచించకుండా ఈ దారుణనైకి ఒడిగట్టాడు. ఇది చూసిన అతని తల్లి భయంతో కేకలు వేయగా, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వెంటనే అతన్ని అడ్డుకున్నారు.

Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు… ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
Young Man : పామును కేకుముక్కల్లా కొరికేతినేసిన యువకుడు.. నెక్స్ట్ ఏంజరిగిందంటే
కుటుంబ సభ్యులు ముందుగా అతనికి నీళ్లు తాగించడంతో పాటు నోటిలో ఉన్న పాము ముక్కలను తీసేశారు. అనంతరం అతన్ని బాబేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపించారు. పాము విషపూరితమైనది కాకపోవడం వల్ల అతని ప్రాణాలకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గ్రామంలో చర్చనీయాంశంగా మారిన ఘటన ఈ విచిత్ర ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాము పట్ల భయంతో ఉంటే తప్ప దాన్ని తినాలన్న ఆలోచన సాధారణంగా ఎవరికి వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మద్యం మత్తు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ సంఘటన మరోసారి నొక్కి చెబుతోంది. ప్రస్తుతం అశోక్ వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.