Night Shift Workers | రాత్రి షిఫ్ట్‌ల ఉద్యోగులకు పెరుగుతున్న ముప్పు.. కిడ్నీలో రాళ్ల ప్రమాదంపై తాజా అధ్యయనం హెచ్చరిక
Night Shift Workers | రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నవారికి, ముఖ్యంగా యువతకు, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం మరింత పెరిగే అవకాశముందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆరోగ్యంపై వేళ్ళూనుకుంటున్న నూతన ముప్పుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ వైద్య జర్నల్ ‘మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్’ లో ఇటీవల ప్రచురితమయ్యాయి.

#image_title
రాత్రి షిఫ్ట్ వల్ల 15% అధిక ప్రమాదం
చైనాలోని సన్ యాట్-సేన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనంలో రాత్రి షిఫ్ట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం సాధారణ ఉద్యోగుల కంటే 15 శాతం అధికంగా ఉందని తేలింది. ముఖ్యంగా శారీరక శ్రమ తక్కువగా ఉండే, స్క్రీన్ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న యువత ఈ ముప్పుకు ఎక్కువగా గురవుతారని నిపుణులు స్పష్టం చేశారు.
రాత్రిపూట పని చేయడం వల్ల శరీర జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్)పై ప్రభావం పడుతుందని, ఇది కిడ్నీల పనితీరును అసమతుల పతంలోకి నడిపిస్తుందని అధ్యయనం పేర్కొంది. జీవక్రియల మార్పు, హార్మోన్ల విడుదలలో అసమతుల్యత వల్ల మూత్రంలో ఖనిజాల మోతాదు పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.