Video Calls : మనిషి జీవితంలో ఆ కార్యం అనేది చాలా ముఖ్యం. పెళ్లి అయినా కాకపోయినా యుక్త వయసు దాటిందంటే అటు ఆడ అయినా మగ అయినా ఖచ్చితంగా ఆ పని చేయాలనే ఆరాటం వాళ్లలో ఉంటుంది. అదే ఒక్కోసారి యువతను తప్పు దారి పట్టిస్తుంది. పెళ్లి అయితే నో టెన్షన్ కానీ.. పెళ్లి కాని వాళ్లు, వృద్ధులు ఎక్కువగా ఇటువంటి విషయాల్లో తొందరపడుతుంటారు. ఆ తర్వాత అడ్డంగా దొరికిపోతుంటారు. తాజాగా ఓ యువతి.. ఏకంగా వృద్ధుడిని టార్గెట్ చేసింది. అతడి వయసు 68 ఏళ్లు. డబ్బున్న వ్యక్తి, వ్యాపార వేత్త కావడంతో అతడికి వల వేసింది. తన బుట్టలో వేసుకుంది. మంచి సమయం కోసం వేచి చూసింది. చివరకు ఆ ముసలాయన దగ్గర్నుంచి అందిన కాడికి దోచుకుంది. ఈ ఘటన గుజరాత్ లోని నవరంగపురలో చోటు చేసుకుంది.
ఆ వ్యాపారికి కొన్ని నెలల కింద ఓ యువతి పోన్ చేసింది. తన గురించి పరిచయం చేసుకున్న తర్వాత అతడిని రెచ్చగొట్టింది. ఆ తర్వాత బట్టలు లేకుండా వీడియో కాల్ చేసింది. అతడిని కూడా బట్టలు విప్పేయాలని కోరింది. దీంతో అతడు కూడా బట్టలు విప్పేశారు. దాన్ని రికార్డ్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు అతడికి ఫోన్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఫోన్ చేసి రూ.50 వేలు కావాలంటూ డిమాండ్ చేసింది .ఈ విషయం బయట పడితే తన పరువు పోతుందని భావించిన ఆ వృద్ధుడు తను అడిగిన రూ.50 వేలు ఆ యువతి అకౌంట్ లో వేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ ఇన్ స్పెక్టర్ అని పరిచయం చేసుకొని బట్టలు లేని ఆ వృద్ధుడి వీడియో తన వద్ద ఉందని బెదిరించి రూ.3 లక్షలు అకౌంట్ లో వేయించుకున్నాడు.
ఆ తర్వాత మరొకరు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ అని చెప్పి.. ఆ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి భయపెట్టి సుమారు రూ.80 లక్షల వరకు ఆ వృద్ధుడి నుంచి రాబట్టారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకు తాను సీబీఐ అధికారిని అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు. కేసు సెటిల్ మెంట్ చేసుకోవాలని రూ.8.5 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు కూడా పంపించాడు. ఆ తర్వాత కేసును క్లోజ్ చేశామంటూ.. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చినట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ ను అతడి అడ్రస్ కు పంపించారు. వాటిపై అనుమానం వచ్చిన ఆ వృద్ధుడు.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతి.. వృద్ధుడి దగ్గర్నుంచి పలు దఫాలుగా రూ.2.69 కోట్లను కాజేసినట్టు పోలీసులు గుర్తించి ఆ కిలాడీ లేడీని వెతికే పనిలో పడ్డారు.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.