Fast charge : మీ మొబైల్ ఫాస్ట్ చార్జ్ కావాలంటే ఇలా చేయండి.. ఇవి మాత్రం అస్సలు చేయొద్దు..!
Fast charge : చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ కావడం లేదని ఏవో ఏవో ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అలా చేయడం ద్వారా ఉన్న మొబైల్ కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారికి తెలియదేమో పాపం. వాస్తవానికి మొబైల్ ఫాస్ట్ చార్జింగ్ కావాలన్నా, ఎక్కవ టైం బ్యాటరీ బ్యాకప్ ఉండాలన్నా కొన్నిసింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ప్రత్యేకంగా దానికోసం కష్టపడాల్సిన పనిలేదు.డబ్బులు పెట్టి రిపేర్లు చేయించడం, కొత్త బ్యాటరీలు తీసుకోవడం కూడా అవసరం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ కలిగిన వారు తమ బ్యాటరీ ఎక్కువ టైం రావాలన్నా, త్వరగా చార్జింగ్ ఎక్కాలన్నా ఈ రూల్స్ ఫాలో అయితే చాలు..
కొంతమంది సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడటం, చాటింగ్ చేయడం, గేమ్స్ ఆడటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వలన బ్యాటరీ దెబ్బతింటుంది. ఎక్కువ కాలం రాదు. చార్జింగ్ పెట్టినప్పుడు పైవేవీ చేయరాదు. అలా పెట్టి వదిలేయండి..అలాగే వైఫై, డేటా, బ్లూటూత్ వంటివి ఆఫ్ చేస్తే ఇంకా బెటర్. చార్జ్ సమంయలోనే కాకుండా మీకు యూస్ చేయనప్పుడు డేటా ఆఫ్‌లో పెట్టుకుంటేనే బెటర్.. అదేవిధంగా ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే కాల్స్ రావు, డిస్టపెన్స్ ఉండదు దీంతో మరింత త్వరగా స్పీడ్‌గా చార్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
Fast charge : ముందు ఇవి మానుకోండి
ఇంకో ముఖ్యమైన విషయం ఎంటంటే ఒరిజినల్ చార్జర్, కేబుల్ వాడితే చాలా బెటర్.. బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు, మన్నికగా ఉంటుంది. బ్యాగ్ రౌండ్స్ యాప్స్ కూడా క్లియర్ చేసుకుంటే ఇంకా బెటర్.. కొంత మంది ఫోన్ చార్జింగ్ 50లోపు వాడుతుంటారు. చార్జ్ పెట్టిన 50 పూర్తవకుండా తీసి కాల్స్ మాట్లాడటం, తమన రౌటీన్ వర్క్స్ చేయడం చాలా పొరపాటు. ఈ విధంగా చేస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువరోజులు రాదు. మినిమమ్ 50 శాతం చార్జ్ పూర్తయ్యాకే మొబైల్ చార్జ్ తీసి వాడుకోవచ్చు. ఇలాంటి సింపుల్ స్టెప్స్ ఫాలో అయి చూడండి.. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.