YS Avinash Reddy : తండ్రిని అరెస్టు చేసిన రెండు గంటల్లో మీడియా సాక్షిగా సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Avinash Reddy : తండ్రిని అరెస్టు చేసిన రెండు గంటల్లో మీడియా సాక్షిగా సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :17 April 2023,1:00 pm

YS Avinash Reddy : తండ్రి వైయస్ భాస్కర రెడ్డిని CBI అరెస్టు చేసిన అనంతరం వైయస్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డిని అరెస్టు చేయటం ఆశ్చర్యం కలిగించిందని స్పష్టం చేశారు. అయినా కానీ ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. వివేక హత్య జరిగిన విషయం నాకంటే ముందు వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ముందే తెలుసు. కీలక విషయాలను సీబీఐ విస్మరిస్తుంది.

MP Avinash Reddy Filed Writ Petition in Telangana High Court - Sakshiవివేక హత్య విషయాన్నీ ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు… గాలి కబుర్లు చెప్పటం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్లు ఆధారంగానే మాట్లాడుతున్నా. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. A4కీ సీబీఐ ఎందుకు సహకరిస్తుంది అంటూ తనదైన శైలిలో అవినాష్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఇదిలా ఉంటే నేడు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి మరోసారి విచారణకు హాజరవుతున్నారు.

YS Avinash Reddy revealed truths within two hours of his father's arrest

YS Avinash Reddy revealed truths within two hours of his father’s arrest

నిన్న నోటీసులు అందుకోవడం జరిగింది. వివేక హత్య కేసులో ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకి హాజరయ్యారు. నేడు మరోసారి హాజరవుతున్న క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారేమో అనే టెన్షన్ వాతావరణం ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణకు భారీ ఎత్తున పులివెందుల నుండి అనుచరులతో అవినాష్ రెడ్డి బయలుదేరడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది