Ys Jagan : ఆళ్లకు ఈ సారైనా మంత్రి పదవి దక్కేనా..?
Ys Jagan : మరికొద్ది రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించబోతున్న సంగత తెలిసిందే. అయితే కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకుంటానని.. మాజీమంత్రులు పార్టీ కోసం పని చేయాలని ఆయన ఇప్పటికే నేతలకు సూచించారు. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనే విషయమై పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్‌పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి తొలి విడతలోనే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా ఆయన నిరాశ మిగిలింది.
ఈసారి మంత్రివర్గంలోకి స్థానం దక్కుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు. కాగా ఆళ్ల వైసీపీలో సీనియర్ నేత. పైగా జగన్ కు నమ్మకమైన లీడర్. నారా లోకేష్ ను ఓడించి మరి మంగళగిరిలో రికార్డు సృష్టించారు. కాగా 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా వైసీపీ నుంచి న్యాయస్థానంలో పోరాడి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టారు.దీంతో 2019లో చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పై పోటీకి దింపారు. అయినా కూడా ఆళ్ల ప్రజా మద్దతుతో విజయం సాధించగలిగారు.

Ys Jagan a ministerial post on Ramakrishnareddy
Ys JAGAN: అమాత్యయోగం ఉందా…
ఎన్నికల ప్రచారంలో జగన్ రామకృష్ణ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఆళ్లకు దక్కలేదు. అయినా ఆయన ఎక్కడ అసంతృప్తికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు.కాగా తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను దృష్టిలో ఉంచుకుని జగన్ మంత్రి పదవి ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని చర్చ జరుగుతోంది.