Home » Andhra Pradesh » Ys Jagan Ap Govt Given Free Hand For Police
andhra pradesh

YS Jagan : శభాష్ వైఎస్‌ జగన్‌… పోలీసులకు ఫుల్‌ ఫ్రీడమ్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 11, 2022, 6:30 pm
Advertisement

YS Jagan : ఏపీలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ దక్కింది అనేది కొందరి అభిప్రాయం. ఒకప్పుడు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వారు పెద్ద పెద్ద నేరస్తులు అయినా కూడా చూసి చూడకుండా వదిలేసేవారు. రాజకీయంలో ఉన్నారు కనుక ఎందుకు వారితో అని అధికార పార్టీ వారు వద్దు అనుకునే వారు. కాని ఇప్పడు జగన్ అలా కాదు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాడు.

Advertisement

మాజీ మంత్రులు మొదలుకుని ఎంతో మంది ప్రముఖులు మరియు స్వయంగా వైకాపా నాయకులను కూడా పోలీసులు వదలకుండా అరెస్ట్‌ లు చేసి.. కేసులు విచారిస్తున్నారు అంటే వారికి జగన్ ఇచ్చిన స్వేచ్చ అనడంల సందేహం లేదు. తాజాగా నారాయణ కాలేజీల అధినేత గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నారాయణ ను పేపర్ లీకేజీ విషయంలో అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వ జోక్యం లేకుండా పూర్తిగా జిల్లా ఎస్పీ కేసు దర్యాప్తు చేసి నారాయణ ను అరెస్ట్‌ చేశారు.

YS Jagan ap govt given free hand for police

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణను పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్‌ చేసినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు ఏమాత్రం మొహమాటం లేకుండా వైకాపా ను విమర్శించడం మొదలు పెట్టారు. రాజకీయంగా ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్‌ మెంట్‌ లేదని ఎస్పీ పదే పదే చెబుతున్నా కూడా వారు మాత్రం వినిపించుకోకుండా పోలీసుల విధులను అడ్డుకుంటూ వారి పై ఆందోళన చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ఆడించినట్లుగా ఇప్పుడు లేదు.. అయినా కూడా వారు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి