YS Jagan : దళిత ఎమ్మెల్యే లకి జగన్ భరోసా ..!!
YS Jagan : ఏడవ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయడం తెలిసిందే. ఈ దాడి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పై టీడీపీ పార్టీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను వైసీపీ దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో దాడిలో గాయపడిన సుధాకర బాబు మోచేతికి అయిన గాయం సీఎంకి చూపించారు. దీంతో దళిత ఎమ్మెల్యేల ఘటనపై సీఎం జగన్ పై స్థాయి విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు…
ఈ క్రమంలో అసెంబ్లీలో జరిగిన దాడికి సంబంధించిన ఫుటేజ్ వీడియోల ద్వారా కేసులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మరొకసారి ఇటువంటి ఘటన జరగదని దళిత ఎమ్మెల్యేలకు జగన్ భరోసా ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నిన్న ఘటన జరిగిన అనంతరం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, హోం శాఖ మంత్రి తానేటి వనిత,
రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, అలజంగి జోగారావు, కిలివేటి సంజీవయ్య, విఆర్ ఎలీజా, తిప్పేస్వామి, కంబాల జోగులు, వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు, ఆర్డర్, తలారి వెంకట్రావు, రక్షణ నిధి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కావాలని చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేల చేత దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయించి రాష్ట్రవ్యాప్తంగా కులాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ ఘటనపై వైసీపీ ప్రజా ప్రతినిధులు కామెంట్లు చేస్తున్నారు.