YS Jagan Cabinet : వైఎస్ జగన్ లిస్టు రెడీ అయిందట.. సీనియర్లకు భారీ షాక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Cabinet : వైఎస్ జగన్ లిస్టు రెడీ అయిందట.. సీనియర్లకు భారీ షాక్?

 Authored By sukanya | The Telugu News | Updated on :24 July 2021,3:59 pm

YS Jagan : ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు వేళయింది. అయితే ఇక్కడ జిల్లాలకు వాటాలు పంచాల్సిన అవసరం లేదు. విస్తరణతో తక్షణ ప్రయోజనాలేవీ లేవు. 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సీఎం జగన్ విస్తరణను వినియోగించునున్నారు. రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని వైఎస్ జగన్ YS Jagan ముందుగానే హింట్ ఇచ్చారు. అయితే టైమ్ దగ్గరపడుతున్నా దానికి సంబంధించిన సిగ్నల్స్ ఇంకా అందలేదు. అయితే మార్పులు మాత్రం పక్కా అన్న టాక్ అధిష్టానం పెద్దల నుంచి వినిపిస్తోంది. దీంతో తమకు అవకాశం ఉంటుందో, ఉండదోనని ఆశావహులు టెన్షన్ పడుతుంటే, తమ పీఠం ఊడుతుందేమోనని మంత్రులు భయపడుతున్నారని కేడర్ చర్చించుకుంటోంది.

YS Jagan Cabinet New List Ready

YS Jagan Cabinet New List Ready


నామినేటెడ్ తో క్లారిటీ.. YS Jagan

ఇటీవలే నామినేటెడ్ పోస్ట్ ల భర్తీతో కాస్తో కూస్తో క్లారిటీ వచ్చింది. మరో మూడు నెలల్లోగా మంత్రి వర్గ విస్తరణ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి పదవుల పంపకంగా కాకుండా రాబోయే ఎన్నికల టీంగా సీఎం వైఎస్ జగన్ YS Jagan భావిస్తున్నట్లు సమాచారం. అంటే మంత్రులుగానే కాదు.. ప్రజల్లోకి దూసుకుపోయే వాళ్లతోనే కొత్త టీం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ లిస్ట్ లో పాతతరం ఎవరికైనా ఛాన్స్ వస్తే, వారు కూడా ఎన్నికల టీమ్ లో ఉన్నట్టే లెక్క. అయితే అలాంటి కీలకమైన ఎన్నికల టీమ్ ను వైఎస్ జగన్ YS Jagan ఆల్రడీ సెట్ చేశారట. ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ లిస్ట్ లీక్ కాకపోవడంతో, నేతల్లో తీవ్ర టెన్షన్ కనిపిస్తోంది.

Ysrcp

Ysrcp

షాక్ తప్పదా.. YS Jagan

మంత్రివర్గ తొలి కూర్పులో కూడా చివరి నిముషంలో సీనియర్లు షాకవ్వగా, యువకులు పదవులు దక్కాయని సంబరపడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి షాకులే ఉంటాయని నేతలు అంటున్నారు. ముందుగా లీకులిచ్చి, ప్రజామోదం తెలుసుకుని ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే తత్వం వైఎస్ జగన్ YS Jagan కు ముందునుంచీ లేదు. తాను అనుకున్న నిర్ణయాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేయడమే వైఎస్ జగన్ అలవాటు.దీంతో కష్టమైనా, నష్టమైనా తాను భరిస్తాననే రకం పద్ధతిలో వైఎస్ జగన్ YS Jagan వ్యవహరిస్తారు. అందుకే ఎన్నికల కొత్త టీమ్ లిస్ట్ ప్రిపేర్ అయినా, ఇంకా అది బయటకు రాలేదు. ఇదిలా ఉంటే, మంత్రుల్లో మాత్రం విపరీతమైన టెన్షన్ కనిపిస్తోంది. తమ పదవికి ఢోకా లేదని ధీమాగా ఉన్నా, చివరి నిమిషం వరకు ఏమీ తెలీకపోవడంతో, లోల్లోపల టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది