Ys Jagan : వైయస్ జగన్ మరో అద్బుతం.. ప్రభుత్వ పాఠశాలలు సౌత్ లోనే నెం.1
Ys Jagan : తెలుగు రాష్ట్రాలలో సెంట్రల్ సిలబస్ విద్యాభ్యాసం అంటే అత్యంత ఖరీదైన విద్య అంటూ ఒక అభిప్రాయం ఉంది. కేవలం ఉన్నతాధికారుల పిల్లలు మరియు డబ్బున్న వారి పిల్లలు మాత్రమే సెంట్రల్ సిలబస్ చదువుతారు అంటూ చాలా మంది భావిస్తారు. అది కొంతవరకు నిజమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పాఠశాలలు రాష్ట్ర స్థాయి సిలబస్ తో మాత్రమే పని చేస్తున్నాయి. సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉన్నా కూడా అవి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేస్తాయి.కనుక ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయి సిలబస్ ఉండే స్కూల్స్ ల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు.
అవి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా రాష్ట్ర స్థాయి సిలబస్ ని ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. సెంట్రల్ సిలబస్ చదివే పిల్లలు కచ్చితంగా ఉన్నత శ్రేణి పిల్లలు అనే ఒక గుర్తింపు ఉంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థును కూడా సెంట్రల్ సిలబస్ చదివేందుకు సిద్ధమవుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దాదాపు 30 స్కూల్స్ లో సెంట్రల్ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించిన ఆదేశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి జారీ చేశారు.ఇప్పటికే నాడు నేడు అంటూ ఎన్నో రకాలుగా స్కూల్స్ ని అభివృద్ధి.
చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు స్కూల్స్ లో ఏకంగా సెంట్రల్ సిలబస్ ను తీసుకురావడం తో ఏపీ విద్య లో నెంబర్ వన్ గా మారుతుందని అంటున్నారు. భారీ ఎత్తున ఇది సక్సెస్ అయితే కచ్చితంగా ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. అదే కనుక నిజమైతే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడి పోవడం ఖాయం. ఇప్పటికే జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ఆయన దేవుడు అంటూ ఏపీ ప్రజలు కొలుస్తున్నారు, పేద పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో విద్యను అందిస్తే కచ్చితంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.