Ys Jagan : ఆ నిర్ణయం వైఎస్ జగన్‌కు ప్లస్.. కేసీఆర్‌కు మైనస్..!
Ys Jagan : 2021 సంవత్సరం కూడా కరోనా నామ సంవత్సరంగా మిగిలేలా కనిపిస్తోంది. 2020 లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నామో…. 2021 లో కూడా అవే సమస్యలు ఎదుర్కొంటున్నాం. కరోనా సెకండ్ వేవ్ అంటూ అందరినీ హడలెత్తిస్తోంది. గత సంవత్సరం కంటే డేంజర్ గా ఉంది ఈసారి వైరస్. ఇండియా మొత్తం మీద కరోనాను కంట్రోల్ చేయలేకపోతున్నాం. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తూనే ఉన్నది. కరోనాను ఎంత కంట్రోల్ చేద్దామన్నా… అది ఎక్కువై పోతోంది తప్పితే తగ్గడం లేదు. వ్యాక్సిన్ వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు.
కరోనా ఇంతలా వ్యాప్తి చెందడానికి ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా ఒకంతుకు కారణమే. ఎందుకంటే… కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయినా కూడా… కేసులు విపరీతంగా పెరుగుతున్నా కూడా దేశంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారాలు, సభలు… ర్యాలీలు.. ఇలా వందలు, వేల మంది గుమికూడాక.. కరోనా రెట్టింపు కాక ఇంకేం అవుతుంది. అంతెందుకు… ఓవైపు కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా… రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఉపఎన్నికలు జరగలేదా? ఓవైపు సాగర్ ఉపఎన్నిక… మరోవైపు తిరుపతి ఉపఎన్నిక. ఈ రెండు ఎన్నికల్లో పార్టీల ప్రచారాలు… సభలు, ర్యాలీలు.. వీటి వల్ల కూడా కరోనా వ్యాప్తి ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు.
అయితే… కరోనా వ్యాప్తిని ముందే పసిగట్టి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 14న తిరుపతిలో నిర్వహించాల్సిన తన బహిరంగ సభను వాయిదా వేశారు. తాను ఈ సభకు వస్తే వేల మంది హాజరవుతారని.. కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని… తనకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని… ఈ సభను క్యాన్సిల్ చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించి… తిరుపతి ప్రజలందరికీ ఓ లేఖను రాశారు. అప్పుడు జగన్ సభను రద్దు చేసుకుంటే… జగన్… నారా లోకేశ్ సవాల్ కు భయపడి సభను రద్దు చేసుకున్నారు అని విమర్శించారు. కానీ… ఇప్పుడు మాత్రం జగన్ సభను రద్దు చేయడం మంచిదైంది అని అంటున్నారు.
Ys Jagan : సాగర్ ఎన్నికల సభ వల్ల కేసీఆర్ కు కరోనా
ఎందుకంటే… తెలంగాణలో సాగర్ ఉపఎన్నిక కూడా ఈనెల 17నే జరిగింది. ఈనెల 14న సీఎం కేసీఆర్.. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. హాలియాలో బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో నాగార్జునసాగర్ మొత్తం ప్రస్తుతం కరోనా హబ్ గా తయారైంది. సభకు వచ్చిన సీఎం కేసీఆర్ తో పాటు… సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఇంకా కొందరు టీఆర్ఎస్ నాయకులకూ కరోనా సోకింది. సాగర్ లో కూడా కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. సీఎం కేసీఆర్ సభ తర్వాత సాగర్ లో కేసులు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అంటే… సీఎం కేసీఆర్ కరోనా ఉన్నా… పట్టించుకోకుండా సభ నిర్వహించి.. కరోనాను రెట్టింపు చేసి పప్పులో కాలేస్తే… తన సభను రద్దు చేసుకొని సీఎం జగన్ మంచి పని చేశారంటూ తెగ మెచ్చుకుంటున్నారు.