Ys Jagan : ఆ ఒక్కటీ చేయగలిగితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగుండదు.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : ఆ ఒక్కటీ చేయగలిగితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగుండదు.!

Ys Jagan : భూమి.. ఇది ఇప్పుడెంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఈ భూమి చుట్టూ చాలా యాగీ జరుగుతుంటుంది. భూ తగాదాలు కుటుంబాల్ని చీల్చేస్తాయి. భూ వివాదాలు ప్రాణాల్ని తోడేస్తాయ్.! ఒకే భూమిని పది మందికి కాదు, పాతిక మందికి కాదు.. వీలైతే వంద మందికి, వెయ్యి మందికి కూడా విక్రయించేసే కేటుగాళ్ళుంటారు. ప్రభుత్వాలు వస్తున్నాయ్.. వెళుతున్నాయ్.. కానీ, భూముల చుట్టూ దోపిడీ మాత్రం కొనసాగుతూనే వుంది. భూ అక్రమాల విషయంలో ఆ […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,1:40 pm

Ys Jagan : భూమి.. ఇది ఇప్పుడెంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఈ భూమి చుట్టూ చాలా యాగీ జరుగుతుంటుంది. భూ తగాదాలు కుటుంబాల్ని చీల్చేస్తాయి. భూ వివాదాలు ప్రాణాల్ని తోడేస్తాయ్.! ఒకే భూమిని పది మందికి కాదు, పాతిక మందికి కాదు.. వీలైతే వంద మందికి, వెయ్యి మందికి కూడా విక్రయించేసే కేటుగాళ్ళుంటారు.
ప్రభుత్వాలు వస్తున్నాయ్.. వెళుతున్నాయ్.. కానీ, భూముల చుట్టూ దోపిడీ మాత్రం కొనసాగుతూనే వుంది. భూ అక్రమాల విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దోపిడీలకు పాల్పడుతుంటారు, అక్రమాలు చేస్తుంటారు. కానీ, ఇకపై అలా కుదరదు.! సమగ్ర భూ సర్వే పేరుతో వైఎస్ జగన్ సర్కారు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

గత కొంతకాలంగా ఈ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తయ్యింది కూడా. మిగిలిన గ్రామాల్లోనూ వేగంగా సర్వే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భూ సర్వే విషయమై అధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. సమగ్ర భూ సర్వే పూర్తయ్యాక కూడా ట్రైబ్యునళ్ళు కొనసాగాలనీ, అవసరమైతే మరిన్ని ట్రైబ్యునళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చనీ, మొబైల్ ట్రైబ్యునళ్ళతో మరింత లాభం చేకూరుతుందనీ, వివాదాలకు ఆస్కారం లేకుండా భూముల కొనుగోళ్ళు, విక్రయాలు జరగడంతోపాటు, హక్కుదారులకు ధైర్యాన్నివ్వడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమనీ ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు.

Ys Jagan Dares A Biggest Change In Governance

Ys Jagan Dares, A Biggest Change In Governance.!

నిజానికి, అత్యంత సాహసోపేతమైన చర్చ ఇది. అధికార పార్టీలోనూ భూ బకాసురులు వున్నారనీ, అధికార పార్టీ సానుభూతిపరులే భూ అక్రమాలకు పాల్పడుతుంటారనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడటం కొత్తేమీ కాదు. మొత్తంగా రాజకీయ వ్యవస్థ అలా వుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోనూ కొందరు నొచ్చుకున్నాసరే, ప్రజా ప్రయోజనార్థం సాహసోపేతంగా సమగ్ర భూ సర్వేకి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ ఇప్పటిదాకా సజావుగానే సాగుతూ, సత్ఫలితాలను ఇస్తోంది కూడా.!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది