Tirupati bypoll : తిరుపతి ఉపఎన్నిక ప్రచారంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం?
Tirupati bypoll : ప్రస్తుతం ఏపీలో ఒక్కటే హాట్ టాపిక్. అదే తిరుపతి ఉపఎన్నిక. తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తాపత్రయంలో అన్ని పార్టీలు ఉన్నాయి. తిరుపతిలో పోటీ మాత్రం ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది. తిరుపతిలో ఎలాగైనా గెలవాలని… వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఏకంగా సీఎం జగనే రంగంలోకి దిగి… తిరుపతి ఉపఎన్నిక కోసం వ్యూహాలను రచిస్తున్నారు. ఈనెల 14న తిరుపతిలో ప్రచారంలో కూడా సీఎం జగన్ పాల్గొంటారు… అని వైసీపీ ఇటీవల ప్రకటించినా.. తాజాగా 14న జరగాల్సిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ రద్దయినట్టు సీఎం జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి… తిరుపతి ప్రజలకు సీఎం జగన్ ఒక బహిరంగ లేఖ రాశారు.
ఆ సభలో తాను ఈనెల 14న తిరుపతికి రాలేకపోతున్నానని… తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ ఉండదని ఆయన లేఖలో తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో… కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతికి రాలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తిరుపతి సభలో పాల్గొంటే వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి.. కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున… తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభను క్యాన్సిల్ చేసుకున్నట్టు సీఎం జగన్ తిరుపతి ప్రజలకు వెల్లడించారు.
ఏపీలో ఒక్కరోజే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే సుమారు 3000 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో సుమారు 500 కేసులు నమోదు అయ్యాయి. నాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం.. వాళ్ల ఆనందమే ముఖ్యం. అందుకే… బాధ్యత ఉన్న ముఖ్యమంత్రిగా… తిరుపతి సభను నేను రద్దు చేసుకున్నా.. అంటూ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
Tirupati bypoll : తిరుపతి నియోజకవర్గం ప్రజలందరికీ నా లేఖ అందాలి
తిరుపతి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాం… ఎటువంటి అభివృద్ధి చేస్తాం… అనేదానిపై.. ప్రతి కుటుంబానికి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా లబ్ధి చేకూరిందో అన్ని వివరాలతో నేను రాసిన ఉత్తరం… తిరుపతి నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ ఉత్తరం అందాలి. నేను చేసిన మంచి ప్రజలకు అందరికీ అందింది అనే నమ్మకం నాకు ఉంది. మీ అందరి దీవెనలను మాకు ఓట్ల రూపంలో ఇస్తారని భావిస్తున్నా. తిరుపతి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా… అంటూ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.