YS Jagan : వైఎస్ జగన్ డైలాగ్ తో సర్కారు వారి పాట కు డబుల్ ప్రమోషన్
YS Jagan : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వం వహించాడు. ఈనెల 12వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్‌లోని మహేష్ బాబు డైలాగులకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో, పాద యాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్ చెప్పిన ఒక డైలాగ్ ని మహేష్ బాబు చెప్పడంతో వైరల్ అవుతోంది.
ఆ డైలాగ్ ను మహేష్ బాబు చెప్పడం వల్ల ఈ సినిమాకు మరింత పాపులారిటీ సంపాదించే ప్రయత్నం చేశాడు. వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో మరియు పాద యాత్ర సమయంలో ఎక్కువగా నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పేదల కష్టాలను తీర్చుతానంటూ ఆ సమయంలో హామీ ఇచ్చాడు. పాదయాత్ర సమయంలో ఎక్కువగా జగన్ చెప్పిన ఆ డైలాగ్ ఫేమస్ అయింది. అందుకే మహేష్ బాబు సినిమా లో నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ పెట్టినట్లు తెలుస్తోంది.

ys jagan dialogue in mahesh babu sarkaru vaari paata movie
ఇలాంటి పొలిటికల్ లీడర్స్ పంచ్ డైలాగ్ లను సినిమాలో వాడటం వల్ల సినిమాలకు ఒక్కోసారి విమర్శలు వస్తాయి. కాని మహేష్ బాబు సినిమా లో జగన్ డైలాగ్ ను వాడటం వల్ల డబుల్ పబ్లిసిటీ దక్కింది. కీర్తి సురేష్ తో కాస్త ఫన్నీ సన్నివేశంలో మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్పడం మరింత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. హీరోగా మహేష్ బాబు ఇలాంటి పంచ్ డైలాగ్స్ కు దూరం ఉంటారు. కాని జగన్ ను అధికారంలోకి తీసుకు వచ్చిన డైలాగ్ అవ్వడంతో తన సినిమాలో వినియోగించాడనే వార్తలు వస్తున్నాయి.