Ys jagan : జగన్ మారేలా కనిపించడం లేదు.. నిరాశలో వైసీపీ నేతలు..!

Authored By mallesh | The Telugu News | Published on: November 28, 2021, 3:00 pm

Ys jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్నిమార్చుకుంటే బాగుండని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటే తమ పంట పండినట్టే అని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ నిర్ణయానికి వైసీపీ నేతల పంట పండటానికి గల లింక్ ఎంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాను తీసుకొచ్చిన రెండు బిల్లులను, ఒక తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు.

అందులో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు కూడా ఉన్నాయి. ఇకపోతే ఆ తర్వాత రోజు ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేశారు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కొందరు వైసీపీ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. జగన్ ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటే తమ పంట పండినట్టే అని భావిస్తున్నారు.ఆ నేతలు ఎవరంటే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమెల్సీలుగా ఎన్నికైన చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాల వలస విక్రాంత్ వర్మ..

Ys Jagan

Ys Jagan

Ys jagan : ఆ పదవులపై ఎమ్మెల్సీల గంపెడాశలు..

వీరంతా ఎమ్మెల్యే కోటాలో శాసన మండలిలో అడుగుపెట్టారు. మరోవైపు 8 జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా కింద మరో 11 మంది ఎమ్మెల్సీలు కూడా పెద్దల సభకు వచ్చారు. అయితే, ప్రస్తుతం వైసీపీ పార్టీకి మండలిలో కూడా కావాల్సిన మెజార్టీ ఉంది. ఇదే వైసీపీ నేతల్లో కొత్త ఆశలను చిగిరింపచేస్తోంది. రాబోయే కాలంలో కేబినెట్ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీలను కూడా తీసుకుంటే బాగుంటుందని వీరంతా ఆలోచిస్తున్నారు.

గతంలో మండలిని రద్దు చేసిన జగన్ ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు అయిన వారిని రాజీనామా చేయించారు. వీరిలో సీనియర్ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి వెంకట రమణ ఉండగా… వీరిని ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభకు పంపించినట్టు తెలిసింది. ఇప్పుడు మండలి మళ్లీ ఏర్పాటైంది. దీంతో మరోసారి కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని వారు గంపెడాశలతో ఎదరుచూస్తున్నారని తెలిసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp