YS Jagan : జగన్ ఎలక్షన్ టీం ఇదే.. లీడర్ గా విజయసాయిరెడ్డి..!
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఏపీలో రెండో సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో వైసీపీ ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. దానిలో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరినీ తమ తమ నియోజకవర్గాలకు పంపించేశారు. అలాగే నియోజకవర్గాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అందరినీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నికల కోసమే ప్రత్యేకంగా అబ్జర్వర్లను కూడా నియమించాలని సీఎం జగన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. దానితో పాటు ఎలక్షన్ కోసం ఒక టీమ్ ను సిద్ధం చేస్తున్నారట జగన్. అందుకోసం పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు సీఎం జగన్. సీనియర్లు, జూనియర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అనే తేడా లేకుండా సీఎం జగన్ తన టీమ్ లో పలు మార్పులు చేస్తున్నారు. అయితే.. సజ్జల, విజయసాయి, కొడాలి లాంటి సీనియర్లను తమ కోఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించారు. వాళ్లకు వేరే పొజిషన్లు ఇచ్చే అవకాశం ఉంది.
YS Jagan : తొలి కేబినేట్ ఉన్నవారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు
సీఎం జగన్ తన తొలి కేబినేట్ లో ఉన్న మంత్రులను తప్పించి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. వారిలో కొందరిని ఇప్పుడు మార్చారు జగన్. పలువురికి వేరే బాధ్యతలు అప్పగించారు. ఇక.. మంత్రిత్వ శాఖ విస్తరణలో ఇప్పటికే పదవులు కోల్పోయిన మాజీ మంత్రులు అవంతి, పుష్ప శ్రీవాణి, సుచరితలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. విశాఖపట్టణం జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు అప్పగించారు. పార్వతీపురం జిల్లా బాధ్యతలను పుష్ప శ్రీవాణి భర్తకు అప్పగించారు. పనితీరును బట్టే పలువురి పదవులను సీఎం జగన్ మార్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. సీఎం జగన్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతున్నారు. దానికోసం చాలానే కష్టపడుతున్నారు.