YS Jagan : వైఎస్ జగన్ మీద అభిమానంతో ఏం చేశాడో చూడండి?
YS Jagan : ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమకు ఇష్టమైన వారిపై అభిమానం చూపిస్తూ ఉంటారు. కొందరికి ఇష్టమైన హీరోలు ఉంటారు.. ఇంకొందరికి ఇష్టమైన హీరోయిన్లు ఉంటారు… కొందరికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్లకోసం వీళ్లు ఏదైనా చేస్తుంటారు. దేవుడి కంటే ఎక్కువగా తమకు ఇష్టమైన వాళ్లను ఆరాధిస్తుంటారు.

ys jagan follower variety campaign for parishad elections
కొందరైతే తమకు ఇష్టమైన వాళ్ల కోసం రక్తదానం చేయడం, ఫ్లెక్సీలు కట్టడం, అన్నదానాలు చేయడం, ఇతర సామాజిక కార్యక్రమాలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలా రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటారు.అయితే.. విజయనగరం జిల్లాకు చెందిన రియాజ్ ఖాన్ అనే వ్యక్తి కూడా తనకు ఎంతో ఇష్టమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద తన అభిమానాన్ని చాలా వెరైటీగా చాటుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్ జగన్ అంటే తనకు ఎంత ఇష్టమో నిరూపించాడు.
YS Jagan : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వినూత్న ప్రచారం
ప్రస్తుతం ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఎన్నికల ప్రచారం కూడా సాగుతోంది. ఈనేపథ్యంలో ఒక జగన్ అభిమానిగా రియాజ్ ఏం చేశాడంటే…. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకొని… ఏపీలో మొత్తం తిరగడం ప్రారంభించాడు. అది కూడా తనకు ఉన్న స్కూటర్ కు వైసీపీ జెండా రంగు వేయించి… వెనుక ఫ్యాన్స్ కట్టుకొని ఏపీ మొత్తం ప్రచారం చేస్తున్నాడు.

ys jagan follower variety campaign for parishad elections
వైసీపీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలంటూ వినూత్న ప్రచారం ప్రారంభించాడు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని ఊళ్లలో ప్రచారం ప్రారంభించాడు రియాజ్. మనోడి ఆలోచన మెచ్చిన ప్రజలు… వైసీపీనే గెలిపిస్తాం… అంటూ చెబుతున్నారు.తన అభిమాన నాయకుడి కోసం… పార్టీ గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తున్న రియాజ్ ను చూసి ప్రజలే కాదు.. వైసీపీ నాయకులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.