Ys Jagan : ఏపీ మహిళా ఉద్యోగులకు దేశం లో ఏ CM చెప్పలేని గుడ్ న్యూస్ చెప్పిన జగన్ !
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. జీడీపీ పరంగా దేశంలో ఎక్కువ నమోదు చేసుకుంటున్నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఒకపక్క పాలన మరోపక్క జగన్ చేస్తున్న రాజకీయం ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా చేస్తూ ఉంది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ఆర్థికంగా బలహీనంగా ఉన్నా గానీ సంక్షేమం విషయంలో.. ప్రజలకు వైఎస్ జగన్ అందించిన పథకాలు..వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే తన తండ్రి దివంగత వైయస్సార్ చనిపోయిన తర్వాత తల్లి,
చెల్లితో కలిసి అసలు సిసలైన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిన జగన్… చాలా విషయాలలో మహిళలకు పెద్దపీట వేయడం తెలిసిందే. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాల విషయంలో మహిళల అకౌంటులకు డబ్బులు జమ చేయడంతో పాటు వాళ్ళ పేర్ల పైనే ఇళ్ళ పట్టాలు వంటివి ఇచ్చి మహిళలలో మంచి ఆదరణ దక్కించుకున్నారు. మహిళల భద్రత విషయంలో కూడా దిశా చట్టం తీసుకురావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారు.
విషయంలోకి వెళ్తే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు జగన్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ చైల్డ్ కేర్ లీవ్ పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు మాత్రమే ఉపయోగించుకో వాలనే నిబంధన గతంలో ఉంది. అయితే ఇప్పుడు దానిని సవరించి మహిళ ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ…చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా ఉపయోగించుకునేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.